రాష్ట్రీయం

నకిలీ నక్సల్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: మావోయిస్టులుగా చెప్పుకుంటూ చలామణి అవుతున్న నకిలీ నక్సల్స్ ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, క్రీడాకారులకు సిపిఐ మావోయిస్టులుగా పేర్కొంటూ లెటర్‌హెడ్లపై బెదిరింపు లేఖలు రాసి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతున్నారు. ఈ తరహా బెదిరింపులపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించి విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులకు ఈ ఇద్దరు నిందితులు చిక్కారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా గంగవరం, తోటపేటకు చెందిన పులపకూరి గణపతి (23), అనంతపురం జిల్లా కామెకల్‌కు చెందిన కొక్కుల అనిల్‌కుమార్‌రెడ్డి (23)లను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. గణపతి హైదరాబాద్ జీవనోపాధి కోసం వచ్చి ఫిల్మ్‌నగర్‌లోని జస్ట్ బిర్యాని పాయింట్‌లో పని చేశాడు. అనిల్ కూడా అదే బిర్యాని సెంటర్‌లో కౌంటర్ బోయ్‌గా పని చేస్తున్నాడు. వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని కథనాలకు స్పందించిన వీరిద్దరు సులభంగా బెదిరింపుల ద్వారా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. సిపిఐ మావోయిస్టులు తెలంగాణ కమిటీ పేరుతో లెటర్‌హెడ్స్ ముద్రించి వాటిపై బెదిరింపు ఉత్తరాలు రాసి ప్రముఖులకు పోస్టు ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత వారికి ఫోన్‌చేసి అడిగిన మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తారు. రూ.20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అలా వసూలైన మొత్తంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రెండు లెటర్‌హెడ్స్, టాటా ఇండికా కారు, రెండు సెల్‌ఫోన్లు, చేతితో రాసిన ఉత్తరాలు, 8 పోస్టల్ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.