రాష్ట్రీయం

రిజర్వేషన్లపై రాష్ట్రాలకే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16:ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లను ఇచ్చే అధికారం రాష్ట్రాలకే ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ‘దేశమంతా రిజర్వేషన్లు ఒకే రీతిలో లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారం రాష్ట్రాలకే ఉండాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లను నిర్ణయించే అధికారంతోపాటు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి అంశాలు కూడా రాష్ట్రాల పరిధిలో ఉండాలని అన్నారు. రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఉండాలని కోరుతూ ఈనెల 23 జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రిని కలిసి కోరనున్నట్టు
చెప్పారు. ఈ లోపు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి, తన వాదనకు మద్దతు కూడగట్టనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే రిజర్వేషన్ల వర్గీకరణపై శాసన సభ తీర్మానం చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత మరోసారి తీర్మానం చేసినట్టు చెప్పారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ఆయన ఆదివారం శాసనసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన రాష్ట్రంలో వర్గీకరణ జరగాలని కోరుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ వద్దనే వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకే అధికారం ఉంటే దేశానికి మంచిద’ని అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయని కెసిఆర్ చెప్పారు.