తెలంగాణ

విమానాశ్రయాల్లో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు విమానాలను హైజాక్ చేయాలన్న కుట్ర సమాచారం అందిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయ భద్రత సంస్థలకు అందిన సమాచారం మేరకు ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
దేశంలోని మూడు విమానాశ్రయాల నుంచి బయలుదేరే విమానాలను హైజాక్ చేసేందుకు 23 మంది సిద్ధమవుతున్నట్టు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్)కు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు తెలిసింది. ఈ మేరకు విమానాశ్రయ భద్రతా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. కుట్రకు సంబంధించిన సమాచారంపై కమిటీ చర్చించి విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేసేందుకు ఆదేశించింది.
ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి బయల్దేరే విమానాలను హైజాక్ చేయడం కోసం ప్రణాళికను ఆరుగురు యువకులు చర్చించుకుంటుండగా తాను విన్నానని ఓ మహిళ తెలిపినట్టు సమాచారం. ఈ మూడు విమానాశ్రయాల నుంచి విమానాలను హైజాక్ చేయడంలో 23 మంది పాల్గొనబోతున్నట్టు ఆమె వివరించినట్టు సెంట్రల్ సెక్యూరిటీ ఇండస్ట్రియల్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఓపి సింగ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో భద్రతను కుట్టదిట్టం చేసి, గస్తీని పటిష్టం చేసినట్టు తెలిపారు. డిజి ఆదేశానుసారం విమానాశ్రయాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్‌స్క్వాడ్, క్యూఆర్టి, బాంబ్ డిటెక్ట్ బృందాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదిలావుండగా ఓ మహిళ అందించిన సమాచారం మేరకు విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతోపాటు తమకు వచ్చిన ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..ఎవరు చేశారు.. హైజాకర్లతో ఆ మహిళకు ఏమైనా సంబంధం ఉందా..అనే కోణం నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.