రాష్ట్రీయం

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జీవన్‌రెడ్డి విమర్శించారు. బిసి, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు 2017పై ఆదివారం శాసన సభలో కాంగ్రెస్ పక్షాన మాట్లాడిన జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే నాలుగు నెలల్లో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కెసిఆర్ మూడేళ్ల తరువాత బిల్లు పెడుతున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ఎస్టీ రిజర్వేషన్లు జీవో ద్వారా పెంచవచ్చునని, 1984లో ఎన్టీఆర్ ఒక జీవో జారీ చేశారని చెప్పారు. అలా చేయక పోవడం వల్ల గిరిజనులు నష్టపోయారని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు, గ్రేటర్‌లో బిసి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అంటే అది కాంగ్రెస్ వల్లనేనని చెప్పారు. బిల్లుకు మద్దతు ఇస్తున్నామని అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. ఇంటింటికి మంచినీటిని అందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని కెసిఆర్ ప్రకటించారని, అదే విధంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు సాధించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు అడగం అని కెసిఆర్ ప్రకటించాలని సవాల్ చేశారు. పనె్నండు శాతం రిజర్వేషన్లు అమలు చేయక పోతే ముస్లింల ఓట్లు అడిగే నైతిక హక్కు టిఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. ఎస్సీలకు ప్రస్తుతం 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వారి జనాభా 17.5 శాతం వరకు ఉందని, 17 నుంచి 18శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిసి జనాభా 52 శాతం ఉందని జనాభా దామాషా ప్రకారం 52శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు 90 శాతం వరకు వెళతాయని, 90శాతం రిజర్వేషన్లు అమలు చేయడం తప్పేమీ కాదని అన్నారు. ఈ బిల్లు న్యాయస్థానాల్లో నిలిచే అవకాశం తక్కువ అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కెసిఆర్ ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చారని, జిఎస్‌టి బిల్లు విషయంలోనూ మద్దతు పలికారని, తన పలుకుబడి ఉపయోగించి ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని అన్నారు. అలా చేర్పించగలమనే నమ్మకం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
హిందుస్తాన్ మా దేశం:
పాషా ఖాద్రీ
ముస్లిం రిజర్వేషన్ల వల్ల భారత్ పాకిస్తాన్ అవుతుందని కొంత మంది విమర్శలు చేయడం బాధాకరమని ఎంఐఎం శాసన సభ్యుడు పాషాఖాద్రీ విమర్శించారు. ‘మేం పాకిస్తాన్‌లో పుట్టలేదు. మేం పుట్టింది హిందుస్తాన్‌లో. హిందుస్తాన్ మా దేశం. మేం హిందుస్తాన్‌ను ప్రేమిస్తాం’ అని అన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నా ఏమీ అనని బిజెపి తెలంగాణలో మాత్రం వ్యతిరేకిస్తోందని అన్నారు. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారంలో ఉంది అక్కడా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి ఏమీ అనలేదని గుర్తు చేశారు. ముస్లింలను దేశ ద్రోహులుగా చూడడం సరికాదని అన్నారు. అభివృద్ధిలో ముస్లింలకు వాటా ఉండాలని అన్నారు. బిసి-ఇ కేటగిరిలో 14 వర్గాలను చేర్చారని, మిగిలిన వారిని ఎఫ్ కోటాలో చేర్చాలని కోరారు.