ఆంధ్రప్రదేశ్‌

ఆదాయం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫలితాల ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు విభజనతో సేవల రంగంలో వెనుకబడ్డాం
ఏడు ఆదాయ ఆర్జనశాఖ అధికారులతో బాబు సమీక్ష నోట్ల రద్దువల్లే ఆదాయం రాలేదన్న అధికారులు

విజయవాడ, ఏప్రిల్ 18:రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సముపార్జించేలా కృషి జరపాలని, మిగిలిన రాష్ట్రాలతో పోటీపడేలా ఆర్జన శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్న రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను, అక్కడ అమలవుతున్న పన్నుల తీరును అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ అమలు చేయాలని చెప్పారు. రెవెన్యూ వృద్ధిలో రాష్ట్ర సగటు కన్నా అట్టడుగున ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. సాధించిన ఫలితాల ఆధారంగా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది బదిలీలు ఇక నుంచి చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఏడు ఆదాయ ఆర్జన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని, లోటును భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజనతో సేవల రంగంలో వెనుకబడిపోయామని, ముందుగా దాన్ని అధిగమించాలని చెప్పారు. ఈఏపి (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)కి సంబంధించి కేంద్ర నిధులను దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా అత్యధికంగా వినియోగించుకున్నామని, అభివృద్ధి విషయంలో ఏ అవకాశాన్ని విస్మరించరాదని అన్నారు.
ఆదాయ ఆర్జనకు అవకాశం ఉన్నా, అటవీశాఖ వెనుకబడిపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన ఎర్రచందనం నిల్వలను వేలంలో విక్రయించుకోలేక విఫలం కావడం సరికాదని అన్నారు. అటు తమ శాఖ ఆదాయం ఆశించినంతగా లేకపోవడానికి నోట్ల రద్దు కారణమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొనగా, మిగిలిన రాష్ట్రాల్లో నోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయడంతోపాటు అవినీతికి ఆస్కారం లేకుండా తీర్చిదిద్దాలని అన్నారు.
2016-17 ఆర్థిక సంవత్సరం సమీక్షలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా రూ.26,264 కోట్లు, కేంద్రం ఇచ్చిన గ్రాంట్ రూ.24,365 కోట్లు, 2016-17 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ లోటు, రాజధాని నగరం, పోలవరానికి సంబంధించి ఇంకా రావాల్సిన నిధులు రూ.3,358.96 కోట్లు. రెవెన్యూ లోటు (2014-15) భర్తీకి కేంద్రం ఇప్పటివరకు అందించినది రూ.1,176.50 కోట్లు, ఇవ్వాల్సిన మొత్తం రూ.1,823.50 కోట్లు. రాజధాని నగరానికి కేంద్రం ఇచ్చినది రూ.450 కోట్లు, భర్తీ చేయాల్సిన లోటు రూ.550 కోట్లు. పోలవరం నిర్మాణానికి అందించిన సాయం రూ.2,514.54 కోట్లు, భర్తీ చేయాల్సిన లోటు రూ.985.46 కోట్లు. ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్‌డిపి రూ.6,99,307 కోట్లు, జిఎస్‌డిపిలో 14.65 శాతం వృద్ధి, పన్ను ఆదాయం రూ.46,285 కోట్లు, వృద్ధిరేటు 9.81 శాతం, మొత్తం జిఎస్‌డీపీలో పన్ను ఆదాయం వాటా 6.61 శాతం.
2016-17 ఆదాయ ఆర్జన శాఖల రెవెన్యూ మొత్తం రూ.46,285.30 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయ ఆర్జన శాఖల రెవెన్యూలో 9.81 వృద్ధి నమోదు. ఆదాయ ఆర్జనలో 12.29 శాతం వృద్ధి సాధించిన వాణిజ్యపన్నుల శాఖ. ఈ శాఖ మొత్తం రెవెన్యూ రూ.33,566.56 కోట్లు, రెవెన్యూ వృద్ధిరేటులో దేశంలో ఏడో స్థానంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఉంది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అంతకుముందు ఏడాది కన్నా వృద్ధిలో 4.01 శాతం క్షీణత కనిపించింది.

చిత్రం... ఆర్జన శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు