తెలంగాణ

‘కూలీ’ పనుల్లో మంత్రులు బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18:‘‘హలో మంత్రిగారున్నారా? లేరండి కూలీ పనికి వెళ్లారు....’’మంత్రి కోసం ఫోన్ చేస్తే వినిపించే సమాధానం ఇది.. ‘‘మంత్రిగారు ఎప్పుడొస్తారు.. సార్ కూలీ పనిలో ఉన్నారు.. ఈ రోజు రారు’’సచివాలయంలో మంత్రి చాంబర్‌లో వినిపిస్తున్న మాటలివి. దాదాపు అందరు మంత్రుల నుంచి ఇవే సమాధానాలు. టిఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభ కోసం వారం రోజుల పాటు కూలీ వారోత్సవం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎంపిలు, శాసన సభ్యులు అంతా ఈ కూలీ వారంలో పాల్గొంటున్నారు. దాదాపు అందరు మంత్రులూ కూలీ పనుల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కూలీ పనిలో పాల్గొంటారు. ఇప్పటి వరకు జరిగిన కూలీ పనుల్లో ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కే ఎక్కువ కూలీ ముట్టింది. సచివాలయం మంత్రులెవరూ లేక బోసి పోయింది. మంత్రులంతా కూలీ పనుల్లోనే ఉన్నారు. ప్లీనరీ, బహిరంగ సభ ముగిసేంత వరకు ఇదే పరిస్థితి. 21న హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించి, 27న వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. గతంలో ఒకే చోట ప్లీనరీ, బహిరంగ సభ నిర్వహించేవారు. దీనికి భిన్నంగా తొలిసారి ప్లీనరీ ఒక చోట బహిరంగ సభ ఒక చోట నిర్వహిస్తున్నారు.
గులాబీ కూలీ పేరుతో వారం రోజుల పాటు పార్టీ వారంతా తప్పని సరిగా కూలీ పని చేసి బహిరంగ సభకు నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో మంత్రులు తమ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూలీ పని చేస్తున్నారు. గృహ నిర్మాణ దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం కూలీ పని ద్వారా 6.11 లక్షల రూపాయలు సంపాదించారు. నిర్మల్‌లో కేదరినాథ్ జిన్నింగ్ మిల్‌లో పత్తి బ్యాగులు మోశారు. రైస్‌మిల్లులో బియ్యం బస్తాలు మోశారు. సిమెంట్ కంపెనీలో సిమెంట్ బస్తాలను మోశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మంగళవారం ధర్మపురి వ్యవసాయ మార్కెట్ యార్డులో కూలీ పని చేశారు. వరి ధాన్యం బస్తాలను తూకం వేశారు. కోరుట్ల, మెట్‌పల్లిలో కవిత కూలీ పని చేశారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూలీ పనిలో పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పెట్రోల్ బంకులో పెట్రోల్ పోశారు. రైస్‌మిల్లు, ఆయిల్ మిల్‌లోపని చేసి నాలుగు లక్షల పది వేల రూపాయల కూలీ సంపాదించారు. సూర్యాపేటలో సువేన్ లైఫ్ ఆఫ్ సైన్స్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి శ్రమ దానం చేసి పది వేల రూపాయలు సంపాదించారు.