తెలంగాణ

నేటినుంచి వేసవి సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తీవ్రమైన వడగాల్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పాఠశాలలకు బుధవారం నుంచే వేసవి సెలవులు ఇవ్వాలలని సిఎం కె చంద్రశేఖరరావు ఆదేశించారు. ఎండవేడి కారణంగా బయట తిరిగే పరిస్థితి లేదని, విద్యార్ధులను బడికి పంపడం శ్రేయస్కరం కాదని సిఎం అభిప్రాయపడ్డారు. బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వేసవి సెలులు అమలయ్యేలా చూడాలని విద్యామంత్రిని, అధికారులను ఆదేశించారు. అయితే సిఎం ఆదేశాలు మధ్యాహ్నం రావడంతో అధికారులు 20నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ముందనుకున్న షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23 వరకూ స్కూళ్లు పనిచేసి 24నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉంది.