రాష్ట్రీయం

కాల్ వస్తే..కదిలొస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 20: ప్రభుత్వ పనులు జరగడం లేదన్న నిస్పృహకు ఇక తావే ఉండదు. తమ పనులు ఎందుకు చేయడం లేదని అధికారుల్ని నిలదీసే హక్కు ప్రజలకు అందే సువర్ణ శఖారంభం కాబోతోంది. దరఖాస్తులు, మధ్యవర్తులు, అధికారులతో పనిలేకుండా ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, సర్కారును ప్రశ్నించే సాంకేతిక విప్లవం శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. పౌరులు తమ సమస్యలు చెప్పడంతోపాటు, స్వయంగా ప్రభుత్వం నియమించిన సిబ్బందే ఫోన్ ద్వారా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే నయా సాంకేతిక విప్లవం అందుబాటులోకి రానుంది. దీనివల్ల అటు ప్రజలకు తమ సమస్యలు ప్రభుత్వానికి నేరుగా తెలియచేశామన్న తృప్తితోపాటు, ప్రభుత్వం కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే వెసులుబాటు ఉన్న ఈ కాల్‌సెంటర్ నేటి నుంచి పనిచేయనుంది. అన్ని విషయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకునే చంద్రబాబు ఇప్పుడు కాల్‌సెంటర్ల వ్యవస్థతో దేశం దృష్టిని మరోసారి ఆకర్షించనున్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల ప్రజలకు పాలనాపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే ప్రజలు తమకు ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలూ పాలనా యంత్రాంగంతో పంచుకోవాలని కోరుకుంటారు. మొత్తం 28 ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తూ ఈ కాల్ సెంటర్ పని చేస్తుంది. ఆయా శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆధ్వర్యంలో పనిచేసే దీనిని శుక్రవారం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు.
రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లనున్న టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలోని ఈ వాస్తవాన్ని గ్రహించి ఎవరితో పనిలేకుండా, నేరుగా ప్రభుత్వానికే ప్రజలు ఫిర్యాదు చేసుకునేందుకు ప్రణాళిక విభాగ పర్యవేక్షణలో ఈ కాల్‌సెంటర్‌ను రూపొందించినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫిర్యాదులన్నీ నేరుగా చంద్రబాబునాయుడికి చేరే సాంకేతిక సౌకర్యం కూడా సమకూర్చుకోవడం విశేషం.
ఈ కాల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవీ..
* గుంటుపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న అత్యాధునిక కాల్ సెంటర్
* 1200 మంది ఉద్యోగులు పనిచేసేలా సువిశాల భవనం
* రాష్ట్ర ప్రణాళికా సంఘం ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంది. అనంతరం సంబంధిత అధికారులకు, శాఖలకు బదలాయింపు.
* ‘పరిష్కార వేదిక’గా ప్రజలకు అందుబాటులో ఉంటుంది
* వీటి ద్వారా వచ్చే ఫిర్యాదులను సిఎం నిత్యం పరిశీలిస్తారు
* వచ్చిన సమాచారాన్ని విశే్లషించి సంబంధిత శాఖలకు రోజువారీ నివేదిక పంపేలా చర్యలు
* పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు చక్కని వేదికగా పనిచేసే వెసులుబాటు
* ప్రజలు ఇచ్చే సలహాలను, సూచనలను తీసుకుని సుపరిపాలన అందించే అవకాశం
*
పునరావృతం కాకూడదు..!

గతంలో బాబు సిఎంగా ఉన్నప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇదే విధంగా కాల్‌సెంటర్ ఏర్పాటుచేసింది. అప్పట్లో దీనికి మంచి స్పందనే లభించింది. అందులో ముఖ్యంగా వీధిలైట్ల సమస్యలే ఎక్కువగా వచ్చేవి. అది కాంట్రాక్టర్లకు, అధికారులకు ఇబ్బందిగా పరిణమించింది. వీధి లైట్ల నిర్వహణ, మరమ్మతులు, వెలగకపోతే కొత్త లైట్ల ఏర్పాటు బాధ్యత కాంట్రాక్టర్లదే. కాల్‌సెంటర్ పెట్టకుముందు వరకూ కాంట్రాక్టర్లు ఆడింది ఆటగా ఉండేది. అధికారులతో ముందుగా మాట్లాడుకుని వారిని లంచాలతో సంతృప్తి పరచడం ద్వారా ఇద్దరూ లాభపడేవారు. కాల్‌సెంటర్ రావడంతో వారి పప్పులు ఉడకలేదు. ఎక్కువగా వీధి లైట్లపైనే ఫిర్యాదులు రావడంతో జాగ్రత్తపడిన కాంట్రాక్టర్లు-అధికారులు కుమ్మకై కాల్‌సెంటర్ సిబ్బందిని మేనేజ్ చేసేవారు. ఎవరైనా వెళ్లి నిలదీస్తే మీకు సమాచారం ఇచ్చాం. కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అంది ఉండదని చెప్పేవారు. ఆ రకంగా విశాఖలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్ వ్యవస్థ కేవలం రెండేళ్లలోనే మూతపడింది.