రాష్ట్రీయం

కల్తీవి అమ్మితే ఖైదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. కల్తీ విత్తనాల నిరోధానికి కొత్తగా చట్టం తీసుకురావాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ప్రగతి భవన్‌లో గురువారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, సిఎంఓ కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పంటల సాగుకు అవసరమైన పరిజ్ఞానం, పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం తరఫున కల్పిస్తామన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని, వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతుల కోసం ఎన్ని వేల కోట్లు అయినా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎరువుల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకు పకడ్బందీగా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారానే వ్యవసాయ కార్యక్రమాలన్నీ సమన్వయం చేస్తామన్నారు. వ్యవసాయ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి, వాటి ప్రస్తుత స్థితి ఎలా ఉంది? తదితర అంశాలన్నింటిపైనా రికార్డులు నిర్వహించాలని సూచించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడు గ్రామస్థాయిలో కూడా వెంటనే రికార్డులు మారేలా రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు
డిమాండ్, మార్కెట్ ఉందనే అంశాలను అధ్యయనం చేసి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కూరగాయలు, పండ్లు, పూలు వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా తెలంగాణకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ ఇక్కడే సాగు చేసేందుకు సహకారం అందిస్తామన్నారు. వ్యవసాయశాఖను బలోపేతం చేయడంతో పాటు, రైతులకు అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రతీ ఐదు వేల ఎకరాలకో ఒకరి చొప్పున వ్యవసాయ విస్తరణాధికారిని నియమిస్తున్నామన్నారు. వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయడంతోపాటు పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఇటీవల నియామకం అయిన వారితో కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం 2112 మంది వ్యవసాయాధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అధ్యయనం కోసం శాస్తవ్రేత్తలను ఇజ్రాయల్ పంపిస్తామన్నారు. వ్యవసాయ భూములను క్రాప్ కాలనీలుగా మార్చుతామని, భూసారం, వర్షపాతం, ఉష్ణోగ్రతను అనుసరించి ఏ ప్రాంతంతో ఏ రకం పంట సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

చిత్రం..వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్