రాష్ట్రీయం

డిఏ పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.668 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యం జూలై 1, 2016 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూలై 1, 2016 నుంచి మార్చి 2017 వరకు ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేసి, ఏప్రిల్ నుంచి వేతనంతోపాటు కలిపి చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 2017లో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు పెంచిన కరువు భత్యం మొత్తాన్ని నగదు రూపంలో ఒకేసారి చెల్లించనున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 18.34 శాతం కరువు భత్యం చెల్లిస్తుండగా దీనిని 22.008 శాతానికి (3.668 శాతం పెరుగుదల) పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పెరిగిన కరవు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రంధాలయ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలో బోధన, బోధనేతర ఉద్యోగులకు, పాలిటెక్నిక్ కళాశాలలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు, జవహర్‌లాల్ నెహ్రు టెక్నలాజికల్ విశ్వవిద్యాలయ ఉద్యోగులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. 2015 నుంచి వేతన సవరణ స్కేళ్లను పొందే ఉద్యోగులంతా పెరిగిన డిఏకు అర్హులని ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.