రాష్ట్రీయం

10 లక్షలిస్తా నా భర్తను తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 22: ఏర్పేడు ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించడానికి వెళ్లిన మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మంత్రి
లోకేష్, నారాయణ, మాణిక్యాలరావు, అమరనాథ్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలతో కలిసి మృతదేహాలకు నివాళులు అర్పించడానికి శనివారం మధ్యాహ్నం మునగలపాళ్యెం వెళ్లారు. తిరుపతికి చేరుకున్న లోకేష్ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న స్విమ్స్, బర్డ్, రుయా, నారాయణ ఆస్పత్రులకు వెళ్ళారు. ఏర్పేడు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల శరీరాలు ఛిద్రమవడంతో ఆ శవాలను ఎక్కువ సమయం ఉంచడానికి కూడా సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. అయితే జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఫ్రీజర్ బాక్సులను ఏర్పాటు చేసింది. శనివారం 12 గంటల ప్రాంతంలో లోకేష్ మంత్రులతో కలసి మునగల పాళ్యెం చేరుకున్నారు. ఈసందర్భంగా ఒక్కొక్క ఇంటికి వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, లోకేష్ రూ.10 లక్షల నష్టపరిహారం చెక్కును అందించారు. ఈ సందర్భంగా సుధాకర్ నాయుడు మృతదేహం వద్దకు నేతలు వచ్చినప్పుడు ఆయన సతీమణి తీవ్ర ఆవేదనకు లోనైంది. ‘దీనికంతటికీ కారణం మీ అనుచరులే. 10లక్షలు నేనిస్తా.. నా భర్తను ప్రాణంతో తెచ్చి ఇస్తారా?’ అంటూ ఆమె బొజ్జలను నిలదీసింది. దీంతో వౌనమే మంత్రుల సమాధానమైంది. కాగా మరికొంత మంది గ్రామస్థులు మాట్లాడుతూ అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరిగివుంటే ఈప్రమాదం జరిగి ఉండేది కాదని, అమరావతి రోడ్లు కాదు మా సంగతి పట్టించుకోండంటూ లోకేష్ సమక్షంలోనే బొజ్జలను నిలదీశారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మహిళలు లోకేష్‌ను గట్టిగా ప్రశ్నించారు. టిడిపి నాయకులే ఇంతపని చేస్తే ఎలాగంటూ నిలదీశారు. దీంతో కొంత అసహనానికి లోనైన లోకేష్ ఎవరో ఇద్దరు వెధవలు చేసిన పనికి పార్టీని తప్పుపట్టుడం సరికాదన్నారు. మీరు చెప్పిందంతా విన్నానని, తాను చెప్పేది కూడా వినాలంటూ వారికి చెప్పారు. ఇసుక మాఫియా గురించి తన దృష్టికి రాలేదన్నారు. దీంతో ఒక మహిళ మాట్లాడుతూ ‘అది కాదయ్యా..ఎంత పెద్ద విషాదం జరిగింది’ అనడంతో లోకేష్ మరింత అసహనానికి గురయ్యారు. ‘ఏం చేయ్యమంటావ్ .. రావద్దంటావా, వెళ్ళిపోతాను’ అంటూ గొంతు పెంచి గట్టిగా అన్నారు. మరుక్షణమే కాస్త తమాయించుకున్న లోకేష్ ఆ మహిళతో అలా కాదమ్మా, రావద్దంటే ఎలా అంటూ సముదాయించే ప్రయత్నం చేశారు.

చిత్రం..భర్త శవం ముందు విలపిస్తూ ఎమ్మెల్యే బొజ్జలను ప్రశ్నిస్తున మహిళ