రాష్ట్రీయం

రేపటినుంచే ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 22: ఎపి ఎంసెట్-2017 తెలుగురాష్ట్రాల్లో ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. అలాగే బయోమెట్రిక్ పద్ధతిలో విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ సంవత్సరం ఎంసెట్‌కు 2,77,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌కు 1,96,967 మంది దరఖాస్తు చేసుకోగా మెడిసిన్, అగ్రికల్చర్‌కు 79,624, రెండు విభాగాలకు 1101 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 128 ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను, అగ్రికల్చర్‌కు 139 కేంద్రాలు మొత్తం 267 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌కు 4, అగ్రికల్చర్‌కు 6 మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 10 వేల రూపాయల అపరాధ రుసుంతో శనివారం సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంజనీరింగ్ పరీక్షలను ఈ నెల 24,25,26 తేదీల్లోను, అగ్రికల్చర్ పరీక్షలను ఈ నెల 28వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం
2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోదలచిన వారు 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని, నిర్దేశిత సమయానికి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని ఎంసెట్-2017 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కచ్చితంగా నిర్దేశిత కేంద్రానికి గంటన్నర ముందుగా హాజరుకావల్సి ఉంటుందని ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. పరీక్ష తేదీ, సమయాన్ని విద్యార్థికి హాల్ టికెట్‌లో తెలియజేశామన్నారు. హాల్ టిక్కెట్‌లో ఏ తేదీని కేటాయించారో అదే ఆ రోజే పరీక్షకు హాజరు కావాలని, లేని పక్షంలో సదరు విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్టు పరిగణిస్తామని పేర్కొన్నారు.