రాష్ట్రీయం

ప్రసూతి ఆసుపత్రిలో ఆగిన ఆపరేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలను నిలిపివేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రసవాలు జరిగే హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈనెల 20న ఇద్దరు బాలింతలు మృతి చెందగా, తాజాగా మరొకరు మృతి చెందటంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. అంతుచిక్కని ఇనె్ఫక్షన్ కారణంగా బాలింతలు చనిపోయారన్న అనుమానాలు గుప్పుమనటంతో శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. మూడు రోజుల తర్వాత ఆపరేషన్లు పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు శివార్లు, ఇతర జిల్లాల నుంచి నిత్యం వందలాది గర్భిణులు ఇక్కడకు వస్తుంటారు. అయితే, ఆపరేషన్లు నిలిచిపోవటంతో నిలోఫర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యామ్నాయ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న మృతి చెందిన ఇద్దరిలో ఒకరు ‘లామా’ (వైద్య చట్టానికి విరుద్దంగా ఆసుపత్రిని విడిచివెళ్లటం) బయటకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారని, పరిస్థితి విషమించిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందినట్టు శనివారం ఆసుపత్రిని సందర్శించిన డిఎంహెచ్‌వో వెల్లడించారు.
కేసు షీట్‌ల పరిశీలన
మృతుల్లో మరొకరు అరుణానగర్‌కు చెందిన శారద (22) ఈనెల 18న ఆసుపత్రిలో చేరి 20న ప్రసవించారు. ఆమెకు ఇనె్ఫక్షన్ సోకి మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఆమెకు రక్తపోటులో వ్యత్యాసాలు రావటంతో మృతి చెందినట్టూ చెబుతున్నారు. అయితే, రక్తపోటులో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయన్న అంశంపై డిఎంహెచ్‌వో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి వాస్తవాలను వెలికితీసేందుకు ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు శనివారం డిఎంహెచ్‌వో విచారణకు నిమిత్తం ఆసుపత్రికి వచ్చారు. ఈనెల 20నుంచి చేరిన బాలింతల కేసు షీట్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. చేరినపుడు వారి ఆరోగ్య పరిస్థితి, ఇక్కడి వైద్యులు అందించిన చికిత్సవంటి అంశాలను అధ్యయనం చేశారు. ఘటనకు సంబంధించిన నివేదికను త్వరలోనే కలెక్టర్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. విచారణలో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేనట్టు తేలిందని, కాకపోతే ఇక్కడ సిబ్బంది, వైద్యులపై పనిభారం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని ఆమె అన్నారు. ఈ రకమైన ఇబ్బందులను అధిగమించే చర్యలు తీసుకోవాలని కూడా నివేదికలో కోరనున్నట్టు ఆమె తెలిపారు. ఇక్కడి ఆపరేషన్ ధియేటర్‌లో ఇనె్ఫక్షన్ ఉందన్న అనుమానంతో ఇక్కడ శస్తచ్రికిత్సలను నిలిపివేసి ప్రత్యామ్నాయంగా రోగులకు నిలోఫర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నట్లు ఆమె తెలిపారు.