రాష్ట్రీయం

ద.మ.రైల్వేకు ఐదు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయి ఐదు అవార్డులు లభించాయి. రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఈ అవార్డులను స్వీకరించారు. చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ సెంటర్ ఫర్ హ్యూమన్ డెవలెప్‌మెంట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా జిఎం ఈ అవార్డులను అందుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంల్, క్లీన్‌లైన్స్, స్టోర్ డిపార్టుమెంట్ల విభాగాల్లో ఈ జాతీయ స్థాయి అవార్డులు లభించాయని రైల్వే తెలిపింది.

చిత్రం..చత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న జిఎం వినోద్‌కుమార్ యాదవ్