రాష్ట్రీయం

వైకాపా ఆఫీసులో సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వైకాపా కార్యాలయంలో గల సోషల్ మీడియా విభాగ కార్యాలయంలో ఆంధ్రా పోలీసులు శనివారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విస్తృతంగా సోదాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన చిత్రాలను పోస్ట్ చేసినందుకు రవికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వైకాపా నేత మధుసూదన్‌రెడ్డి నడుపుతున్న పొలిటికల్ పంచ్ వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై అశ్లీల చిత్రాలను పోస్టు చేసేందుకు ప్రోత్సహిస్తున్నందున అతనికి నోటీసులు జారీ చేస్తున్నామని ఏపి పోలీసులు తెలిపారు. దీంతో సాక్షి సోషల్ మీడియా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వైకాపా ఐటి విభాగం నేత మధుసూదన్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, శ్రీనివాసులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, వైకాపా నేతల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈనెల 24, 25 తేదీల్లో మధుసూదన్‌రెడ్డి, రవికిరణ్ విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఇదిలావుంటే, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, సోషల్ మీడియాను అణగదొక్కుతున్న చంద్రబాబుపై అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోరాటం చేయాలని వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైకాపా మద్దతుదారులంతా ఈ దారుణంపై స్పందించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. సోషల్ మీడియాపై టిడిపి ప్రభుత్వం అసహనాన్ని ప్రదర్శించడాన్ని వైకాపా నాయకులు ఖండించారు. వైకాపా సోషల్ మీడియా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని వారు తప్పుబట్డారు. మీడియా విషయంలో టిడిపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందని వైకాపా నేత కన్నబాబు అన్నారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారకూడదని మరో నాయకడు జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబుకు కంటిమీద కునుకు కరువయ్యే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన హెచ్చరించారు.
మేమూ కేసులు పెడతాం : సుధాకర్
కాగా, వైకాపాపై సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పెట్టే కామెంట్లపై తాము కూడా కేసులు పెడతామని వైకాపా లీగల్ సెల్ నేత సుధాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని కేసులు పెట్టడం సరికాదన్నారు.