రాష్ట్రీయం

5న ఎంసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5న ఎంసెట్ ఫలితాలు
ఏప్రిల్ 28న ప్రిలిమినరీ కీ
జూన్ 19నుంచి ఇంజనీరింగ్ తరగతులు
మంత్రి గంటా వెల్లడి ప్రశాంతంగా పరీక్ష

కాకినాడ, ఏప్రిల్ 24: ఎపి ఎంసెట్-2017 ఫలితాలు మే 5న విడుదల చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 28న ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా కౌనె్సలింగ్ ప్రక్రియ పూర్తిచేసి, జూన్ 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించడానికి కృషిచేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జెఎన్‌టియులో సోమవారం ఉదయం ఎంసెట్-2017 పాస్‌వర్డ్‌ను మంత్రి విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాను, హైదరాబాద్‌లోను 267 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఇంజనీరింగ్, ఈనెల 28న మెడిసిన్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లమధ్య నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలను మూడు సంవత్సరాలుగా వరుసగా జెఎన్‌టియుకెకు అప్పగించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ఎంసెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఆన్‌లైన్‌లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావడం విశేషమని పేర్కొన్నారు. ఫలితాలను మే 5న విడుదల చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. జూన్ 19 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనివలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సాధకబాధకాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటినుండో అమల్లో ఉన్న ఒక నిమిషం నిబంధనను ప్రభుత్వం సడలించిందని, ఆలస్యానికి తగిన కారణాలను విద్యార్థులు వివరించిన పక్షంలో ఒకటి, రెండు నిమిషాల వరకు పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు.

చిత్రం... కాకినాడలో ఓ ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న
జెఎన్‌టియు-కె వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్