ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట రైల్వేస్టేషన్‌లో దారుణం..
పట్టపగలు తమిళ యువకుడి ఘాతుకం
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
సంచలనం రేకెత్తించిన ఘటనః

రాజంపేట, ఏప్రిల్ 26: రైలు బోగీ తలుపు వద్ద నిలుచునే విషయంలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. ఆవేశంతో విచక్షణ కోల్పోయిన తమిళ యువకుడు అంతా చూస్తుండగానే విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రం గా గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటతో రైలు ప్రయాణికులు, ప్లాట్‌ఫారంపై ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్ష్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా ఖాజీపేట మండలం కూనెవారిపల్లెకు చెందిన నవీ న్ కుమార్ రెడ్డి తిరుపతి చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్ళేందుకు బుధవారం కడప రైల్వేస్టేషన్‌లో ముంబాయి-చెన్నై లెవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. బోగీ తలుపువద్ద నిలుచునే విషయంలో గుర్తు తెలియని ఓ తమిళ యువకుడితో ఘర్షణ పడ్డాడు. నందలూరు రైల్వేస్టేషన్ నుంచి ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్టు సమాచారం. రాజంపేట రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే నవీన్‌కుమార్‌రెడ్డి కిందికి దిగాడు. రైలు తిరిగి కదులుతుండగా ఎక్కే సమయంలో తమిళ యువకుడు నవీన్‌కుమార్‌రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నవీన్‌కుమార్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ఈ ఘటనకు పాల్పడ్డ తమిళ యువకుడు అదే రైలులో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రాజంపేట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరా తమిళ యువకుడు..?
నవీన్‌కుమార్‌రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు భావిస్తున్న రైలులో ప్రయాణిస్తున్న తమిళ యువకుడు ఎవరన్నది తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన తమిళ యువకునికి సంబంధించి ఎలాంటి వివరాలు పోలీసులకు అందలేదు. దీంతో రైలు బోగీలో ఉన్న ప్రయాణికుల ద్వారా తమిళ యువకుని ఆధారాలు ఏవైనా లభిస్తాయేమోనన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. రాజంపేట ఆసుపత్రిలో నవీన్‌కు ప్రాథమిక చికిత్స అందించిన సమయంలో అర్బన్ సిఐ అశోక్‌కుమార్ జరిగిన సంఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది, అందుకు ముందు ఏం జరిగింది అన్న విషయాలను నవీన్‌కుమార్‌రెడ్డి వివరించినట్లు సమాచారం. రేణిగుంట రైల్వే పోలీసులు సైతం రంగంలోకి దిగి కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

చిత్రం... పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నవీన్‌కుమార్‌రెడ్డి