ఆంధ్రప్రదేశ్‌

యజమానీ బాధ్యుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
డ్రైవర్‌తో పాటు యజమానిపైనా కేసు
టోల్‌గేట్ల వద్ద ‘బ్రీత్ ఎనలైజర్లు’
‘రోడ్డు భద్రతా బోర్డు’ ఏర్పాటుకు సిఫార్సు

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ప్రమాదాల నివారణ దిశగా తక్షణ చర్యలకు ఉపక్రమించింది. కఠిన నిర్ణయాలు, సంస్కరణలతో ‘రోడ్డు ప్లాన్’కు ప్రణాళిక సిద్ధం చేసింది. పోలీసు, రవాణాశాఖల సమన్వయంతో సంయుక్త తనిఖీలు రాష్టవ్య్రాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. ప్రమాదం జరిగితే డ్రైవర్‌తోపాటు వాహన యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. జాతీయ రహదారులపై టోల్‌గేట్లు వద్ద బ్రీత్ ఎనలైజర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో బుధవారం రోడ్డు భద్రతపై సమీక్ష జరిగింది. పోలీసు, ఆర్ అండ్ బి, రవాణాశాఖల ఉన్నతాధికారులతో మంత్రులు చినరాజప్ప, కె అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలపై చర్చించారు. రోడ్డుప్రమాదాలపై ప్రత్యేక అజమాయిషీ ఉండేలా ‘రోడ్డు భద్రతాబోర్డు’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేసేందుకు సమావేశం తీర్మానించింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో మూడుశాఖలు కలిసి రోడ్డుప్రమాదాలకు ఆస్కారం ఉన్న ‘బ్లాక్‌స్పాట్స్’ గుర్తించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది మూడువేల మంది చనిపోతున్నారని, 30వేల మంది అంగవైకల్యానికి గురవున్నారన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసుశాఖల సమన్వయంతో ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు హోమంత్రి చెప్పారు. రవాణా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏర్పేడు ఘటన గుణపాఠంగా తీసుకుని రోడ్డు ప్రమాదాలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్ అండ్ బి, పంచాయితీ, ట్రాన్స్‌పోర్టు, పోలీసులు, ఎక్సైజ్, నేషనల్ హైవేస్ తదితర శాఖలతో ఓ ప్రత్యేక రోడ్డు భద్రతా బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రిని కోరతామన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని 25 టోల్‌గేట్లు వద్ద బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేస్తామని, లారీల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగితే డ్రైవర్‌తోపాటు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి మూడో మంగళవారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, వారంలో ఒకరోజు పోలీసు, రవాణా శాఖ సిబ్బంది రోడ్డుపైకి వచ్చి రాష్టవ్య్రాప్తంగా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో పోలీసు, రవాణా శాఖల సిబ్బందితో ఐదు ప్రత్యేక బృందాలు నిరంతర పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ఇఛ్చాపురం నుంచి విశాఖ అడ్డరోడ్డు వరకు నిర్వహించిన సర్వేలో 1100 ‘బ్లాక్ స్పాట్స్’ గుర్తించినట్లు చెప్పారు. ఇక హెల్మెట్, సీటుబెల్టు వాడకం పక్కాగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో డిజిపి నండూరి సాంబశివరావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, ఆర్ అండ్ బి సెక్రటరీ సుమితా దావ్రా, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, అదనపు డిజిపి దామోదర్, హరీష్‌గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.