రాష్ట్రీయం

మళ్లీ జయం మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరాడి సాధించుకున్నాం..పట్టుదలగా నిలబెట్టుకున్నాం..అదే స్ఫూర్తితో రాష్ట్రాన్నీ అభివృద్ధి చేసుకుందామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుతో ఓరుగల్లు తెరాస ఆవిర్భావ సభ మార్మోగింది. మూడేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అన్ని వర్గాలకు అందించిన ప్రయోజనాలను వివరిస్తూ, అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు తమకే పట్టం గడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాద బలం ఉన్నంతవరకూ తమను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. చివరి రక్తం బొట్టు వరకూ ప్రజాసేవకే తాను అంకితమన్నారు. గత పాలకుల నిర్వాకం వల్ల తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయిందన్న కెసిఆర్ ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి తాము చేపడుతున్న చర్యల్ని వివరించారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రైతు దేశంలోనే ధనవంతుడైన రైతు అవుతాడని చెప్పారు. ఎన్నడూ లేని రీతిలో, ఏ పార్టీకి సాధ్యంకాని విధంగా తెరాస నిర్వహించిన ఈ సభ తమ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చాటుతోందన్నారు. మాడ్చేస్తున్న ఎండను సైతం లెక్క చేయకుండా ఆవిర్భావ సభకు ఉత్సాహంగా, ఉత్తేజంగా లక్షల సంఖ్యలో తరలిరావడం పార్టీ ఆవిర్భావ స్ఫూర్తికి, ప్రజల నిబద్ధతకు నిదర్శనమన్నారు. భారీ ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ సభకు అనూహ్య రీతిలో భద్రతా ఏర్పాట్లూ చేశారు.