రాష్ట్రీయం

శాసన సభ సీట్ల పెంపునకు కేంద్రం సుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచటం పట్ల కేంద్రం సుముఖంగా ఉన్నదని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పేర్కొన్నారు. గురువారం ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కలిసి శాసన సభ సీట్ల పెంపకం, నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్ర సహాయం గురించి చర్చించారు. శాసన సభ సీట్లు పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వెంకయ్యనాయుడు తనతో అన్నారని శివప్రసాదరావు విలేఖరులతో చెప్పారు. అసెంబ్లీ సీట్లు పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నందున పెంచటం పెద్దసమస్య కాదని శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు చిన్నవైపోయినా జనాభా పెరిగినందున ప్రజాప్రతినిధులను కూడా పెంచుకోవలసిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయుడుకు వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచవలసిన అవసరంపై తాను చేసిన వాదనతో వెంకయ్యనాయుడు ఏకీభవించాలని శివప్రసాదరావు తెలిపారు. రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుముఖంగా ఉన్నారని వెంకయ్యనాయుడు తనతో చెప్పారని ఏపీ స్పీకర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభను డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నామన్నారు. ఇదిలా ఉంటే నర్సరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని వెంకయ్యనాయుడుకు విజప్తి చేసినట్లు ఆయన తెలిపారు. పేదలకు ఇళ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లు శివప్రసాదరావు వివరించారు.