రాష్ట్రీయం

హైకోర్టు ఆదేశాలపై ఎస్‌ఎల్‌పి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వీలులేదంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి)ను దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల ప్రతులను పరిశీలించి హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే 2016 ఫిబ్రవరి 26వ తేదీన జీవో 16ను జారీ చేసింది. కాని ఈ జీవోను ఉస్మానియా నిరుద్యోగ జెఏసి హైకోర్టులో సవాలు చేసింది. ఈ జీవోను కొట్టివేస్తూ విచారణను జూన్ నెలకు హైకోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,826 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. తమ సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందని గంపెడాశతో వీరు ఉన్నారు. 3700 మంది జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, 926 మంది డిగ్రీ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, 450 మంది పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు, గురుకుల పాఠశాలల్లో 750 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు సర్వీసుపై పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 22000 మంది ఉద్యోగులు కాంట్రాక్టు సర్వీసుపై పనిచేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్ శాఖలో 23వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి సర్వీసులను కూడా క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖలోని గ్రామీణ మంచినీటి సరఫరా పథకంలో పనిచేసే 125 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ఇంజనీర్లు, అటవీ శాఖలో పనిచేసే 130 మంది సిబ్బంది, వివిధ శాఖల్లో పనిచేసే కొంత మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల సర్వీసులను క్రమబద్ధీకరించింది. ఇంకా 277 మంది ల్యాబ్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్టులు, పారా మెడికల్ సిబ్బంది, 33 మంది హెల్త్ అసిస్టెంట్ల సర్వీసులను ఇంతవరకు క్రమబద్ధీకరించింది. ఇంతవరకు మొత్తం 565 మంది సర్వీసులను స్థిరపరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ రాష్ట్రంలో వివిధ శాఖల్లో 7 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించవచ్చని గుర్తించి నివేదిక తయారు చేసింది.