రాష్ట్రీయం

జెఇఇ మెయిన్‌లో తెలుగువారి సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: జెఇఇ మెయిన్ ఫలితాలను సిబిఎస్‌ఇ గురువారం విడుదల చేసింది. పరీక్షలో సాధించిన మార్కులను, ఆల్ ఇండియా ర్యాంకుల వివరాలను సిబిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో ఉంచింది. తాజా గణాంకాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 20వేల మంది జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ నెల 28వ తేదీ నుండి మే 2వ తేదీ వరకూ మెయిన్‌లో అర్హత సాధించిన 2.20 లక్షల మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనరల్‌తో పాటు మిగిలిన కేటగిరీలు తీసుకుంటే తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. జనరల్ కేటగిరిలో మాత్రం మోహన్ అభ్యాస్ ఆరో ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12 లక్షల మంది దరఖాస్తు చేసినా, 9.5 లక్షల మంది రాశారు. తెలుగు రాష్ట్రాల నుండి 1.43 లక్షల మంది రాశారు. ఇందులో తెలంగాణ నుండి 65వేల మంది, ఆంధ్రా నుండి 78 వేల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 2న ఆఫ్‌లైన్‌లో నిర్వహించగా తెలుగు రాష్ట్రాల నుండి 1.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్ పరీక్షకు రెండు రాష్ట్రాల నుండి 20,748 మంది దరఖాస్తు చేశారు. ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో 27న జెఇఇ మెయిన్ మార్కులతో పాటు ర్యాంకులను కూడా విడుదల చేసింది.
28 నుంచి దరఖాస్తులు
ఐఐటిల్లో 2017-18 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు శుక్రవారం నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అడ్వాన్స్ పరీక్ష మే 21న జరుగుతుంది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలతో కూడిన సమాచార పత్రాన్ని నిర్వాహక సంస్థ చెన్నై ఐఐటి విడుదల చేసింది. 2015 ఐఐటి అడ్వాన్స్‌డ్‌కు 1.50 లక్షల మందిని అనుమతించగా, 2016లో రెండు లక్షల మందికి అవకాశం ఇచ్చారు. ఈసారి దానిని 2.20 లక్షలకు పెంచారు. రిజర్వేషన్ క్యాటగిరీల వారీ చూస్తే అడ్వాన్స్ పరీక్షకు ఓపెన్ క్యాటగిరి నుండి 50.5 శాతం అంటే 1,11,100 మందిని, ఒబిసిలో 27 శాతం 59,400 మందిని, ఎస్సీల్లో 15 శాతం 33వేల మందిని, ఎస్టీల్లో 7.5 శాతం అంటే 16,500 మందిని అనుమతిస్తారు. ఆలస్యపు రుసుంతో మే 4వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టిక్కెట్లను మే 10 నుండి 21 వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఒఎంఆర్ జవాబుపత్రాలను మే 31 నుండి అందుబాటులో ఉంచుతారు. జవాబు కీని జూన్ 4న ప్రకటించి, ఆరో తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 11న ప్రకటిస్తారు.