రాష్ట్రీయం

ఈ రెండేళ్లూ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 28:ప్రజల్లో సంతృప్తిస్థాయి పెంచడమే పరమావధిగా పనితీరు ఉండాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 80 శాతం మంది సంతృప్తి చెందాలని, ఇందుకోసం అత్యవసర, స్వల్పకాల, దీర్ఘకాల విధానాలను అనుసరించాలని సూచించారు. ఈ రెండేళ్లు ప్రభుత్వానికి చాలా కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి.. జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లు, సిసి రహదారులు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయివంటి కనీస వసతులను నూరు శాతం కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. సుస్థిర వృద్ధికి సంబంధించి 17 లక్ష్యాలు, సమాజం కుటుంబ వికాస లక్ష్యాలు, జివిఎ, జిఎస్‌డిపికి అనుగుణంగా పాలన సాగించాలని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అల్పాహార విందు సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో అత్యుత్తమ పాలన ఎలా అందించాలి, ప్రభుత్వ కార్యక్రమాలను, విజయాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, తదితర అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలు అభిప్రాయాలు తెలుసుకునేందుకు మీ కోసం పోర్టల్, కాల్ సెంటర్, కైజాలా, ఎలక్ట్రానిక్-ప్రింట్ మీడియాలపై ఆధారపడాలని ముఖ్యమంత్రి సూచించారు. సలహాలను సమాచారాన్ని సేకరించి విశే్లషణ చేయడం, సమస్యలకు కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా 80 శాతం సంతృప్తి తీసుకురావడం సులభ సాధ్యమన్నారు.
24 గంటల విద్యుత్ ఇవ్వడంలో విజయం సాధించామని, ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ సరఫరా నష్టాలను నివారించేందుకు సంకల్పించామని ఇందుకోసం ప్రతి విద్యుత్ కనెక్షన్‌ను స్మార్ట్ మీటర్‌తో అనుసంధానిస్తున్నామని, దీంతో రియల్ టైమ్‌లో రీడింగ్ నమోదై, సరఫరాలో నష్టాలు వెల్లడవుతాయని చెప్పారు. వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు బిగిస్తున్నామని, విద్యుత్ సంస్కరణల్లో కలెక్టర్లు భాగస్వాములు కావాలని చెప్పారు.
గ్రామీణాభివృద్ధిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపిన ముఖ్యమంత్రి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 25 శాతం వృద్ధి సాధించేలా తోడ్పాటును అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో బయోమెట్రిక్ అమర్చడం త్వరితగతిన పూర్తికావాలని స్పష్టం చేశారు.
అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని, అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు-సిబ్బంది ఆస్తులను స్వాధీన పరచుకోవాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సిటిజన్ చార్టర్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. మెజార్టీ పౌర సేవలు ఆన్‌లైన్ చేయడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని, అధికారుల్లో జవాబుదారీతనం పెంచాలని అన్నారు.
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడకుండా పశువులకు పశుగ్రాసం-నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలపై సమాచారం అందించాలని చెప్పారు.

చిత్రం..కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు