రాష్ట్రీయం

ధరలో దగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 28: మిర్చి మద్దతు ధర చెల్లింపులో రైతులు అడుగడుగునా దగాపడుతున్నారు. పదిరోజుల క్రితం ప్రభుత్వం క్వింటాల్‌కు 15 వందల మద్దతు ధర ప్రకటించటంతోపాటు తొలివిడతగా రూ. 50 కోట్లు మంజూరు చేసింది. అయితే రైతులకు చెల్లించే పరిహారంలో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుంటోంది. దళారుల చేతివాటంతో మద్దతు ధర రైతు చేతికందే పరిస్థితి లేదు. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చివరకు అస్సాంలో సైతం మిర్చి సాగు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం వరకు ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మద్దతు ధర ప్రకటించడంతో లక్షలాది టిక్కీలు యార్డుకు చేరుతున్నాయి. దీంతో వ్యాపారులు చెప్పిందే వేదంగా మారింది. మద్దతు ధర ప్రకటించక ముందు 273 మోడల్ రకం 3500 నుంచి పది వేల రూపాయల వరకు కొనుగోలు చేశారు. కొందరు మోతుబరి రైతులు, వ్యాపారులు కుమ్మక్కయి ప్రభుత్వ పరిహారం కోసం ధరలు తగ్గించి చూపుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డుకు శుక్ర, శని, ఆది వారాలు సెలవుకావడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించారు. కనిష్ఠ ధర 2500 నుంచి 5500 వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. 364 రకానికి మాత్రం 7,500 నుంచి 7,700 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. 334 మోడల్ ధర 2800 నుంచి 3600 రూపాయల వరకు పలుకుతోంది. ఇదిలాఉండగా ప్రభుత్వ మద్దతు ధర 15 వందలతో కలుపుకుని క్వింటాల్‌కు 8000 రూపాయలు ఉండేలా నిబంధనలు విధించారు. దీంతో వ్యాపారులు నాణ్యమైన సరకుకు కూడా ఐదువేల లోపు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ఎనిమిది వేలు పైబడితే ఎలాగూ మద్దతు ధర వర్తించదు కనుక ఈలోపే ధర చెల్లిస్తున్నారు. నిబంధనలను సడలించి క్వింటాల్‌కు 10వేల రూపాయల ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తేకానీ వెసులుబాటు కలగదని రైతులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో 12లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోళ్లు జరపాలని
ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా మరో మూడు లక్షల క్వింటాళ్లు రాష్ట్రానికి వచ్చాయి. దీంతో రైతులకు చెల్లింపులలో జాప్యం జరుగుతోంది. మద్దతు ధర ఇతర రాష్ట్రాల రైతులకు వర్తించదని చెప్తున్నా కర్నాటక, తెలంగాణలో వ్యాపారులు చేతులెత్తేయడంతో ఏపికి తరలిస్తున్నారు. ఇది ధరలపై ప్రభావం చూపుతోంది. సప్లయి పెరగటంతో డిమాండ్ తగ్గింది. గుంటూరు మిర్చి యార్డు నుంచి బంగ్లాదేశ్, మలేషియా, చైనా, అరబ్ దేశాలతో పాటు శ్రీలంకకు ఎగుమతులు చేస్తుంటారు. ఈసారి నాణ్యతాలోపంతో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఏతావతా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర ఈ నెల 20 నుంచి చెల్లింపులు జరపాల్సి ఉంది. సంబంధిత వ్యవసాయాధికారుల నుంచి సాగు ధ్రువీకరణ పత్రాలతోపాటు వ్యాపారులు రైతుల అకౌంట్‌లో జమ చేస్తేనే నిబంధనల ప్రకారం మద్దతుధర జమ అవుతుంది. ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా వ్యాపారులు చెల్లించాల్సిన సొమ్ము జమ కావటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రన్న రాయితీ పథకం పేరిట మిర్చి మద్దతు ధర కింద ఏ ఒక్క రైతుకూ రూపాయి జమ కాలేదు. సోమవారం నుంచి కొనుగోళ్లను పునరుద్ధరిస్తారు. మరో పదిరోజుల్లో వేసవి సెలవులు ముంచుకొస్తున్నాయి. అనంతరం జూన్ 12వ తేదీ నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. జూన్ నెలాఖరుతో మద్దతు ధర గడువు పూర్తవుతుంది. ఈ పరిస్థితుల్లో ఎంత మంది రైతులకు పథకం వర్తిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావును వివరణ కోరగా చెల్లింపులకు మరో వారంరోజుల వ్యవధి పడుతుందని చెప్పారు. వ్యాపారులు రైతుల ఖాతాలో నగదు జమ చేసిన వెంటనే ప్రభుత్వ మద్దతు ధర నేరుగా వారి అకౌంట్లలో పడుతుందని తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.