రాష్ట్రీయం

మిర్చి కార్చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 28: గిట్టుబాటు ధర కోసం రైతన్న కనె్నర్ర చేశాడు. కనీస ధర చెల్లించకున్నా ప్రభుత్వం స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని ఫర్నిచర్, కాంటాలను ధ్వంసం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో అధికంగా శుక్రవారం రెండున్నర లక్షల మిర్చి బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి. గురువారం తెరాస సభ సందర్భంగా సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ శని, ఆది, సోమవారాల్లోనూ సెలవు ప్రకటించిన నేపథ్యంలో తమ పంటను అమ్ముకునేందుకు రైతులంతా శుక్రవారం మార్కెట్‌కు చేరారు. తెల్లరేసరికి మిర్చి బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయి. ఎటుచూసినా మిర్చి బస్తాలు రోడ్లపైనే ఉన్నాయి. గరిష్ఠ ధర 6 వేల వరకు పలికినప్పటికీ వ్యాపారులు కొంతమంది 3 వేలకే క్వింటా మిర్చి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోడ్లపైనే కాంటాలు వేశారు. కనీసం మార్కెట్‌లోకి వెళ్ళకుండానే రోడ్లపైనే కాంటాలు వేస్తూ రైతులకు తక్కువ ధర ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే గిట్టుబాటు ధర దక్కటం లేదంటూ కాంటాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పత్తి, మిర్చి, అపరాల మార్కెట్ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కొందరు ఫర్నిచర్‌ను, కాంటాలను ఒక దగ్గరికి చేర్చి దగ్ధం చేశారు. ఈ సమయంలో మార్కెట్ కార్యదర్శితో పాటు సిబ్బంది తమ ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టారు. మరి కొంతమంది రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్ చాంబర్‌లోకి వెళ్ళి ఫర్నిచర్‌ను, ఫైళ్ళు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులతో కలసి ఆందోళన చేశారు. ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆందోళన ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని వెంకటవీరయ్య చెప్పినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఒకానొక సమయంలో సండ్రపైనా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం. ఈ సమయంలో మార్కెట్‌కు పోలీస్ కమిషనర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని పరిస్థితి అదుపులోకి తేచ్చే ప్రయత్నం చేశారు. ఒక కానిస్టేబుల్‌కు గాయం కావటంతో పోలీసులు తమదైన శైలితో ఆందోళనకారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా మార్కెట్‌కు చేరుకొని రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధరకు మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టిడిపి నేత స్వర్ణకుమారి, సిపిఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ క్వింటా మిర్చికి 10 వేల రూపాయలు చెల్లించకపోతే రైతు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం వెంటనే రైతులను అదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రైతుల నుండి పంటలను కొనుగోలు చేసేందుకు శనివారం మార్కెట్ తెరచి ఉంచుతామని చైర్మన్ కృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మార్కెట్‌ను సందర్శించి రైతులకు సంఘీభావం తెలుపుతామని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

చిత్రం.. ఖమ్మం మార్కెట్‌కు భారీగా వచ్చిన మిర్చి
*రైతులు నిప్పు పెట్టడంతో దగ్ధమవుతున్న ఫర్నిచర్, ఫైళ్లు (ఇన్‌సెట్‌లో)