రాష్ట్రీయం

మిట్టల్‌పై చర్యకు హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: వివాదస్పద ఆస్తి కేసులో నిరభ్యంతర పత్రాన్ని నిర్లక్ష్యంతో జారీచేసిన ఉదంతంపై హైదరాబాద్ పూర్వ కలెక్టర్, ప్రస్తుత మున్సిపల్ శాఖ కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌పై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. అలాగే ఉదంతంతో సంబంధం కలిగిన హైదరాబాద్ పూర్వ జాయింట్ కలెక్టర్ దుర్గాదాసుతో పాటు స్పెషల్ తహశీల్‌దారు వివి వెంకట్‌రెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ బాబురావుపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. బాధితురాలికి జరిమానాగా
రూ.25 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తనకు సంబంధించిన ఆస్తిపై ఇతరులకు తప్పుడు నిరభ్యంతర పత్రం జారీ చేయడంపై శాంతి అగర్వాల్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ జరిపి ఈమేరకు తీర్పునిచ్చారు. ఎన్‌ఓసి కమిటీ అధికారులు చట్టబద్ధంగా పత్రాలు సరైనవో కావో పరిశీలించకుండానే నిరభ్యంతరం పత్రాన్ని జారీ చేశారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతవాసి కె శాంతదేవి గుడి మల్కాపూర్ నానల్‌నగర్‌లో ప్రేమ్ మల్హోత్ర అనే వ్యక్తినుంచి 5262 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే సయ్యద్ అబ్దుల్ రబ్ మరో ఇద్దరు వ్యక్తులు సదరు ఆస్తిపై తమకు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని 2009లో దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ అధ్యక్షతనగల ఎన్‌ఓసి కమిటీ పత్రం జారీ చేయగా, దరఖాస్తుదారుడు ఫోర్జరీ పత్రాలు సమర్పించినట్టు ఆస్తిహక్కుదారు శాంతాదేవి ఫిర్యాదు చేశారు. దరఖాస్తుదారుడు సమర్పించిన పత్రాలు ఫోర్జరీవేనని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో పిటిషన్‌దారు కోర్టును ఆశ్రయించగా నవంబర్ 19, 2011లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఎన్‌ఓసి పత్రం జారీ చేసిన డ్రాఫ్ట్‌మెన్‌పై విచారణ జరిపి చర్య తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. పత్రాలు పరిశీలించకుండానే ఎన్‌ఓసి జారీ చేయడంతో అది చెల్లదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల నిర్లక్ష్యంగా ఎన్‌ఓసి జారీ చేయడంపట్ల జరిమానగా బాధితురాలికి రూ.25 వేల నగదు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే తప్పుడు పత్రాలతో ఎన్‌ఓసి పొందిన అబ్దుల్ రబ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి బాధితురాలికి మరో రూ.25 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తమ ఎన్‌ఓసిపై కోర్టులో సవాల్ చేసిన హుస్సేన్ బీ మరో 11మంది దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి కొట్టివేయడంతోపాటు, వీరు కూడా జరిమానగా రూ.10 వేలు బాధితురాలికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో వివాదస్పద ఆస్తి సంగతి తేలేవరకు ఆ స్ధలాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవాలని భూపరిపాలన కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.