తెలంగాణ

బిసి ఓటర్ల లెక్కింపు నిలిపివేతకు హైకోర్టు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27; గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారం తేలకుండా బిసి ఓటర్ల లెక్కింపును చేపట్టడాన్ని నిలిపివేయాలని కోరుతూ టిడిపి నాయకుడు ఫిరోజ్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఆనాసక్తి వ్యక్తం చేశారు. ఇటీవల తొలగించిన 6.3 లక్షల ఓటర్లు జాబితాలో చేర్చితే బిసిలకు వార్డుల కేటాయింపులో ఎక్కువ స్థానాలు దక్కుతాయని పిటిషన్‌దారు వాదించారు.
ఈ వ్యవహారంపై జిహెచ్‌ఎంసి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకొని కోర్టుకు నివేదించాల్సిందిగా అడ్వకేట్ జనరల్ రామకృష్థారెడ్డిని న్యాయమూర్తి ఆదేశించారు.