రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులతో వచ్చే వారం సిఇఏ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: రెండుతెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలపై నెలకొన్న వివాదాలు కొలిక్కి రానున్నాయి. వచ్చే వారం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ అథారిటీ నిర్ణయించింది. ఈమేరకు రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులను ఆహ్వానించనుంది. ఒకటి రెండు రోజుల్లో తేదీలు ఖరారుకానున్నాయి. ఇప్పటికే పలు పర్యాయాలు రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారంపై సిఇఏ తీసుకున్న చర్యల వల్ల ఎటువంటి ఫలితాలు కనపడలేదు. విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలపై ఇంతవరకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించడంలో కేంద్రం విఫలమైంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, హిందూజా, తెలంగాణలో భూపాలపల్లి, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల విద్యుత్ పంపకాలు, రెండు రాష్ట్రాల్లో జల విద్యుత్ పంపకాలపై పేచీ నెలకొని ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు విద్యుత్ సంస్ధలకు ఈ ప్రాజెక్టుల విద్యుత్ పంపకాలపై అభిప్రాయాలు తెలియచేయాలని సిఇఏ ముసాయిదా పత్రాలను పంపింది. భూపాలపల్లిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. ఇటీవల 600మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. సింగరేణి 600 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో మొదటి యూనిట్ త్వరలోవిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. కేంద్రం విభజన చట్టంలో ఆంధ్రాకు 46.11 శాతం, తెలంగాణకు 53.89 శాతం విద్యుత్‌ను కేటాయించింది. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం ప్రారంభించిన ఈ రెండు ప్లాంట్ల నుంచి తమకు విద్యుత్ రావాల్సి ఉంటుందని ఇప్పటికే ఏపి డిస్కాంలు, ట్రాన్స్‌కో కేంద్రాన్ని కోరాయి. కాగా సీలేరు జల విద్యుత్ ప్లాంట్ నుంచి తమకు విద్యుత్ రావడం లేదని తెలంగాణ విద్యుత్ సంస్ధలు కేంద్రానికి తెలిపింది. కృష్ణపట్నం విద్యుత్‌లో తమకు వాటా ఉందని, తమకు విద్యుత్ పంపిణీ చేయాలని తెలంగాణ తొలుత కోరింది. కాని అందులో వాటా లేదని ఏపి చెప్పడంతో, విద్యుత్ రంగంలో స్వావలంభన దిశగా తెలంగాణ అడుగులు వేసి, ప్రస్తుతం విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కింది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశాలను నిర్వహించడం కంటే, ముఖ్యమంత్రుల సమావేశాల్లోనే విద్యుత్ వివాదాలు తేలాల్సి ఉంటుందని ఏపి విద్యుత్ వర్గాలు తెలిపాయి.