రాష్ట్రీయం

గ్రేహౌండ్స్‌కు ససేమిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్సల్స్ గాలింపునకు దళాలను పంపలేం
వ్యూహం చెబుతాం.. అమలు చేయండి
హోంశాఖకు తెగేసి చెప్పిన ఆంధ్ర, తెలంగాణ

హైదరాబాద్, ఏప్రిల్ 29: మావోయిస్టుల పీచమణచటంలో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గ్రేహౌండ్స్ బలగాల సేవలను పొరుగు రాష్ట్రాల్లో వినియోగించేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తిరస్కరించాయి. తాము ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారాన్ని అందిస్తామని, వారిని పట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహ విధానాలను పంచుకునేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నామని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు తెలిపాయి. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నరమేధానికి 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు నేలకొరిగిన విషయం విదితమే. దీనిపై కేంద్ర హోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో ఆయా రాష్ట్రాలు మావోయిస్టులను పట్టుకునేందుకు అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ఆంధ్ర, తెలంగాణలో గ్రేహౌండ్స్ బలగాలను దండకారణ్యంకు పంపే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా కోరింది. దీనికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సున్నితంగా తిరస్కరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వామపక్ష తీవ్రవాదం వల్ల మూడున్నర దశాబ్ధాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా దెబ్బతిందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో పోలీసులు, ఉన్నత పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, ప్రజలను పొగొట్టుకున్నామని కేంద్రానికి పోలీసు అధికారులు తెలిపినట్లు సమాచారం. గ్రేహౌండ్స్‌ను 1989లో అప్పటి ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ ఏర్పాటు చేశారు. వామపక్ష తీవ్రవాదుల నిర్మూలనలో గ్రేహౌండ్స్‌కు మంచి పేరుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులతో చర్చలు జరపడం, విఫలం కావడం తెలిసిందే. అనంతరం గ్రేహౌండ్స్ పోలీసుల వేటలో నాలుగేళ్ల కాలంలో దాదాపు మావోయిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగైంది. ప్రస్తుతం ఆంధ్రలో విశాఖపట్నం ఏజన్సీకి పరిమితమైంది. ఈ ప్రాంతం దండకారణ్యంను ఆనుకుని ఉంది. దండకారణ్యంను ఆనుకుని తూర్పుగోదావరి జిల్లా ఖమ్మం, భూపాలపల్లి జయశంకర్, మంచిర్యాల జిల్లాలు ఉన్నా, నక్సలైట్లకు ఆశ్రయం ఇవ్వడానికి ప్రజలు విముఖత చూపుతున్నారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు నామమాత్రంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాల గాలింపు చర్యల వల్ల కంటే, స్ధానికంగా ఉన్న పోలీసులను జంగిల్ వార్ ఫేర్‌లో మంచి శిక్షణ ఇవ్వడం, నిఘా వ్యవస్ధను పటిష్టం చేయడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం, స్ధానిక ప్రజలకు అభివృద్ధి ఫలాలను సత్వరమే అందేటట్లు చూడడం, పోలీసులకు ఆధునాతన ఆయుధాలు, అన్నింటి కంటే ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుని గాలింపు చర్యలు చేయడం అనేవి ముఖ్యమని పోలీసు అధికారులు కేంద్రానికి తెలిపారు.