రాష్ట్రీయం

పది నిమిషాల్లో మమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: భూ సేకరణ చట్ట సవరణకు ఉభయ సభలూ ఆమోదం తెలిపాయి. చట్టానికి సవరణలు చేయాలంటూ కేంద్రం తిప్పి పంపి న నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ కేవలం పదే పది నిమిషాల్లో చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. మిర్చి రైతుల సమస్యలపై చర్చించాక చట్ట సవరణ బిల్లును చేపట్టాలంటూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ సభ్యుల డిమాండ్లను తోసిపుచ్చుతూ మూజువాణి ఓటుతో భూ సేకరణ చట్ట సవరణకు ఆమోదం లభించినట్టు స్పీకర్ ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు శాసన మండలిలోనూ తంతు దాదాపు ఇదే పద్ధతిలో నడిచింది. కేవలం మూడున్నర నిమిషాల్లోనే సవరణ బిల్లును సభ ఆమోదించిందని చైర్మన్ ప్రకటించి, సభను నిరవధికంగా వాయిదా వేశారు.
శాసనసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన వెంటనే భూ సేకరణ చట్టానికి సవరణలు సూచిస్తూ కేంద్రం పంపించిన బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా స్పీకర్ మధుసూదనాచారి రెవిన్యూ మంత్రి మహమూద్ అలీని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టంలోని క్లాజు 2, 6లను తొలగించటం
సహా మొత్తం 11 సవరణలను ఆమోదించాలని మహమూద్ అలీ ప్రతిపాదిస్తుండగా, కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లో నుంచి లేచి మిర్చి రైతుల సమస్యపై సభలో చర్చించిన తర్వాతనే భూ సేకరణ బిల్లుపై సవరణలు ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో ఖరారు చేసిన మేరకే సభా కార్యకలాపాలు కొనసాగుతాయి తప్ప అదనంగా మరే ఇతర అంశాలపై చర్చకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోకుండా ‘మిర్చి రైతుల సమస్య ప్రభుత్వానికి పట్టదా, ఇది సభలో చర్చించాల్సిన అంశం కాదా?’ అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్ట సవరణ అంశంపై మాత్రమే సభలో చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ మరోసారి స్పష్టం చేస్తూ, ఎంఐఎం సభ్యుడు పాషా ఖాద్రీని మాట్లాడాల్సిందిగా ఆదేశించారు. తమ వాదనను స్పీకర్ వినిపించుకోకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా పోడియం వైపు దూసుకు వచ్చారు. వారిని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఎంఐఎం సభ్యుడిని కూర్చోవాల్సిందిగా స్పీకర్ ఆదేశించి మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించినట్టు పేర్కొంటూ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం స్పీకర్ తన చాంబర్‌లోకి వెడుతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారిని మార్షల్స్ నిలువరించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టింది మొదలు ఆమోదించేవరకూ పట్టిన సమయం పదే పది నిమిషాలు కావడం గమనార్హం. శాసన మండలి రికార్డ్
ఇక శాసనమండలి కేవలం మూడున్నర నిమిషాల్లోనే అజండా పూర్తి చేసింది. చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన మండలి సమావేశం ప్రారంభం కాగానే సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ఎంఐఎం సభ్యుడు జాఫ్రి ప్రకటించారు. కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, కనీస మద్దతు ధర లభించక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా మాట్లాడబోతుండగా మైక్ కట్ అయింది. కేవలం భూసేకరణ చట్టం-2013 సవరణ బిల్లుపైనే మాట్లాడాలని చైర్మన్ ఆదేశించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా ఒక్క ఉదుటున లేచి మిర్చి రైతులను ఆదుకోవాలంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పోడియంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. ఒకవైపు ఆందోళన జరుగుతుండగానే భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదిస్తున్న వారెవరో చెప్పాలంటూ కోరుతూ, ఆ మరు నిమిషంలోనే మండలి ఈ బిల్లును ఆమోదించిందని ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా కేవలం మూడున్నర నిమిషాల్లో పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత స్వల్ప వ్యవధిలో మండలి అజండా పూర్తి కావడం ఇదే తొలిసారి.
ఇవీ ప్రధాన సవరణలు
గతంలో ‘ప్రయోజనాలు విఘాతం కలగకుండా’ అని ఉన్నచోట ‘ఎవరి ప్రయోజనాలకూ విఘాతం కలగకుండా చట్టం అమలు’ అంటూ పదా ల్లో మార్పు చేశారు.
భూ సేకరణ చట్టం ఎప్పటినుంచి అమలు అనే విషయం గతంలో ఆమోదించిన బిల్లులో లేకపోవడంతో ఈ చట్టం జనవరి 1, 2014 నుంచి అమలులోకి వస్తుందని సవరించారు.
భూ సేకరణ చట్టం-2013 క్లాజ్ 6లో భూ సేకరణకు ముందు కలెక్టర్లు భూమి ధరను రివైజ్ చేయాలనే నిబంధన
(క్లాజ్ -6) ఉంది. ఈ క్లాజ్‌ను ‘మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను నిర్ణయించాలి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సవరించింది. అయితే క్లాజ్ -6 అనవసరమంటూ కేంద్రం తాజాగా పేర్కొనడంతో ఆ క్లాజ్‌ను పరిహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో సవరణ చేసింది.

* భూసేకరణ చట్టం-2013లోని క్లాజ్ -7, 8లలో భూములు కోల్పోయిన వారికి పునరావాసం కోసం పరిహారం ఇవ్వాలంటూ పేర్కొన్నారు. అయితే భూములు కోల్పోయినవారే కాకుండా ఆ భూములపై ఆధార పడిన వ్యవసాయ కూలీలకు కూడా పెద్దగా వ్యత్యాసం లేకుండా పరిహారం చెల్లించాలంటూ తాజాగా సవరణ చేశారు.

* భూ సేకరణ చట్టంలో అత్యవసరం అనుకునే పనుల కోసం కలెక్టర్లు అవార్డు పాస్ చేసి భూ సేకరణ జరపవచ్చు. దానికి కేంద్రం అనుమతి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సరిపోతుంది. ఈ మేరకు క్లాజ్ 10 అనవసరమని కేంద్రం సూచించడంతో దానిని తొలగిస్తూ సవరణ చేశారు.

చిత్రం..గన్‌పార్క్ వద్ద బిజెపి ఎమ్మెల్యేల వౌన ప్రదర్శన