రాష్ట్రీయం

ఈ పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 2: రైతులకు గిట్టుబాటుధర కల్పించే వరకు పోరాటం ఆగదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్వహిస్తున్న రెండురోజుల రైతుదీక్ష మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ముగింపు సభలో జగన్ మాట్లాడుతూ విభజన తరువాత పరిశ్రమలు, వ్యాపారాలు తెలంగాణలోనే ఉండిపోయాయని, వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అవసరాలను తీర్చటంలో ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని ధ్వజమెత్తారు. ఏ ఒక్క పంటకూ కనీస ధరలేదన్నారు. రైతు కళ్లల్లో కన్నీరు కనిపిస్తే ప్రభుత్వానికి పుట్టగతు లుండవన్నారు. ‘నా రికార్డును నేనే బ్రేక్‌చేస్తాను’ అంటూ గొప్పలు చెప్పుకునే సిఎం చంద్రబాబు వ్యవసాయాన్ని అధోగతి పాల్జేయటంలో రికార్డులు బద్దలు కొట్టారని జగన్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా మిర్చి రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా క్వింటాల్‌కు 2500 నుంచి 4000 రూపాయలకు మించటంలేదు. ప్రభుత్వం ముష్టి విదిలించి సరిపెట్టుకోమంటూ రైతుల్ని దగా చేస్తోందని ఆరోపించారు. ‘2014లో ఖరీఫ్ సాగు 40.96 లక్షల హెక్టార్లు ఉంటే 16-17లో 37 లక్షల హెక్టార్లకు పడిపోయింది. రబీలో అదే సంవత్సరాలకు 27 లక్షలకు గాను 19.78 లక్షలకు సాగు తగ్గింది. చంద్రబాబు అధికారంలోకి రాకముందు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలను బేషరతుగా రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మూడేళ్లలో వడ్డీ 48వేల కోట్లకు చేరింది బాబు అధికారంలోకి వచ్చాక పంటలు ఎండిపోయాయి. ఉపాధిలేక కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. పోలవరం అంచనాలు 16వేల కోట్ల నుంచి 40వేల కోట్లకు పెరిగాయి. పట్టిసీమను 22శాతం అధిక టెంటర్లకు కట్టబెట్టారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం అడుగుకు 15 వందలు చెల్లించాల్సి ఉండగా పదివేల రూపాయల వరకు కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. ఇదంతా కమీషన్ల కోసమేన’ని జగన్ ధ్వజమెత్తారు. కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన లోకేష్ పేరును లో ..క్యాష్ అని టిడిపి నాయకులే చమత్కరిస్తుంటారని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో కేంద్రం మెడలు వంచి రైతులకు కనీస మద్దతుధర సాధించారని గుర్తుచేశారు. బాబు అధికారంలోకి రావటంతోనే కరవును వెంటబెట్టుకు వచ్చారని విమర్శించారు. అంతకుముందు ఒక రైతు ఇచ్చిన నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించారు.

చిత్రాలు..జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేస్తున్న దృశ్యం, దీక్ష ముగించి ప్రసంగిస్తున్న వైఎస్ జగన్