రాష్ట్రీయం

రికార్డుకెక్కిన అవయవ దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మే 2: అవయవదానం చేయడం గొప్ప విషయమని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుజన్మదినం సందర్భంగా అవయవదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఈ కార్యక్రమంలో 11,987 మంది అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాలను అందచేశారు. గతంలో 6,900 మంది అవయవదానం చేస్తామని ముందుకు రాగా, నేడు నరసరావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11,987 మంది అవయవదానం చేసేందుకు ముందుకు రావడం ఒక చరిత్ర అని అన్నారు. అంగీకార పత్రాలను తీసుకునేందుకు 150 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచ రికార్డుగా నిలుస్తుందన్నారు.
అవయవదానం చేయడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా జీవన్‌దాన్‌కు స్పీకర్ కోడెల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిఇఓ కృష్ణమూర్తి ప్రకటించడం అభినందనీయమన్నారు. ఏటా 50లక్షల మంది అవయవాలు అందక మృతి చెందుతున్నారని తెలిపారు. స్పీకర్ కోడెల చరిత్రలో నిలిచిపోతారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొనియాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి స్వప్నీ ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని ప్రజలు 11,987 మంది అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాలను అందచేశారని, ఇది చరిత్ర అని అన్నారు. అనంతరం ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్ట్ఫికెట్‌ను స్పీకర్ కోడెలకు అందచేశారు.

చిత్రాలు....అవయవదానంలో పాల్గొన్న ప్రజలు,
* గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు