రాష్ట్రీయం

ఒక్క రోజులోనే పిఎఫ్ చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్) చెల్లింపులు, ఇతరత్రా సమస్యలను ఒక్క రోజులోనే పరిష్కరించాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంబంధిత అధికారులనును కోరారు. ఇటీవల పిఎఫ్ కార్యాలయంలో పదోన్నతి పొందిన 1999 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఘనంగా సన్మానించారు. ఉత్తర్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ఘడ్, పంజాబ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన అధికారులు దత్తాత్రేయను పొగడ్తలతో ముంచెత్తారు. సన్మానించేందుకు పోటీ పడ్డారు. అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగిస్తూ ఇపిఎఫ్‌ఒలో గత 18 సంవత్సరాలు సేవలందిస్తున్న అధికారులకు పదోన్నతులు రాకపోవడంతో, తాను సెంట్రల్ బోర్డు ట్రస్టీ చైర్మన్‌గా చొరవ తీసుకుని బోర్డు సమావేశంలో ఆమోదం తీసుకున్నానని చెప్పారు. పదోన్నతులు కల్పించానని ఆయన తెలిపారు. 10 లక్షల కోట్ల కార్ఫస్ ఫండ్ ఉందన్నారు. లక్ష కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగులు, అధికారులు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పిఎఫ్ కార్యాలయం అంటేనే వేధింపుల సంస్ధగా లోగడ ముద్ర పడిందని, పిఎఫ్ చెల్లింపులు లేదా మరేదైనా సమస్య పరిష్కారం కోసం వెళితే మూడు, నాలుగు నెలలు తిరగాల్సి వచ్చేదని అన్నారు. తాను కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెల్లింపులను మూడు రోజుల్లో చేస్తున్నామని, దీనిని ఒక్క రోజులోనే చేయాల్సిందిగా కోరుతున్నానని ఆయన అధికారులనుద్ధేశించి తెలిపారు. పిఎఫ్ ఖాతాదారులకు యుఎఎన్ నెంబర్ ఇచ్చామని, దీంతో వారు ఆన్‌లైన్ ద్వారానే సేవలు పొందవచ్చని ఆయన చెప్పారు. ఇ-గవర్నెన్స్ ద్వారా గొప్ప సంస్కరణలు చేపట్టామని ఆయన వివరించారు. ఇంకా గ్రూపు హౌసింగ్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పిఎఫ్ వడ్డీ రేటును 8.65 శాతంగా చేస్తూ, నోటిఫికేన్ జారీ చేశామని, దీంతో ఖాతాదారులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. పిఎఫ్ కార్యాలయం ప్రపంచంలోనే అతి గొప్ప సంస్ధగా పేరు తెచ్చుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ వ్యక్తం చేశారు. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని, అందుకే ఎన్డీటివీ జాతీయ టివీ ఛానల్ ఉత్తమ అవార్డును అందజేసిందని ఆయన తెలిపారు.
మహిళలకు పెద్ద పీట
రాబోయే రోజుల్లో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు. మున్ముందు మహిళల ప్రాముఖ్యత పెరుగుతుందని, కార్మిక, పిఎఫ్ కార్యాలయాల్లో వెంటనే 50 శాతం కాకపోయినా, 30 శాతం ఉద్యోగాలు మహిళలకు లభించాలన్నారు. పదోన్నతులు కల్పించడం బాధ్యతగా భావించానని బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రాంతీయ రీజినల్ పిఎఫ్ కమిషనర్ ఎం. శ్రీకృష్ణ ప్రారంభోపన్యాసం చేస్తూ 18 సంవత్సరాల తర్వాత పదోన్నతులు కల్పించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయకు పదోన్నతి పొందిన అధికారులు కుటుంబ సభ్యులు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. తెలంగాణ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రవీంద్ర కుమార్ కొండ్రు వందన సమర్పణ చేస్తూ దత్తాత్రేయ సేవలను కొనియాడారు. తెలంగాణ పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్లు జెవిఎస్‌ఎస్ కుమార్, జె. శ్రీనివాస్, పివి రావు, ఎం. సుబ్రహ్మణ్యం, దుర్గా ప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ ప్రావిడెంట్ ఫండ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ కేంద్ర మంత్రి దత్తాత్రేయకు పాదాభివందనం చేశారు. శ్రీకాంత్, నాగేశ్వర రావు, ప్రవీణ్, సుధాకర్ తదితరులు దత్తాత్రేయను ఘనంగా సన్మానించారు.
‘బాలింతల మరణాలు ఆందోళనకరం’
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతల మరణాల పట్ల దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా, కోటి ప్రసూతి ఆసుపత్రిలో బాలింతలు మరణిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన పిల్లలు కూడా మరణిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరుతున్నానని ఆయన తెలిపారు.

చిత్రం.. కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయను గజమాలతో సత్కరిస్తున్న వివిధ రాష్ట్రాల ఇపిఎఫ్‌ఓ అధికారులు