తెలంగాణ

కెసిఆర్‌కు నేడు కంటి ఆపరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం కంటి ఆపరేషన్ జరుగనున్నట్లు తెలిసింది. శనివారం ఢిల్లీకి వచ్చిన చంద్రశేఖర్ రావుకు దక్షిణ ఢిల్లీలోని ఒక కంటి వైద్యుడు వైద్యం చేయటం తెలిసిందే. కంటి ఆపరేషన్ కోసం ఆయన గత రెండు రోజుల నుండి మందులు వాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రశేఖర్ రావుకు మంగళవారం మధ్యాహ్నం కంటి ఆపరేషన్ జరిగిన తరువాత మరో రెండు మూడు రోజుల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చినప్పటి నుండి అత్యంత ముఖ్యమైన అధికార విధులను మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

శిక్ష సబబే
భార్యను చంపిన భర్త కేసులో
దిగువ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 8: భార్యను చంపిన భర్త కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సోమవారం సమర్థించింది. సకాలంలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టలేమని హైకోర్టు న్యాయమూర్తులు సురేశ్ కుమార్ కైత్, యు దుర్గాప్రసాద్ రావులు పేర్కొన్నారు. సిద్దిపేటకు చెందిన ఎం శ్రీనివాస్‌కు ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి విధించిన శిక్షను హైకోర్టు సమర్థించింది. ఎఫ్‌ఐఆర్‌ను చాలా రోజుల తర్వాత దాఖలు చేశారనే సాకు చూపించి కేసును కొట్టివేయలేమని హైకోర్టు పేర్కొంది.

ఈసెట్‌ను రద్దు చేయండి
సర్కారుకు కొనగాల మహేశ్ డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 8: తెలంగాణ ఈసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో పద్ధతిలో నిర్వహించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఆ పరీక్షను వెంటనే రద్దు చేయాలని టిపిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈసెట్ పట్ల విద్యార్థుల్లో చాలా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఉదయం ప్రారంభం కావాల్సిన పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించారని చెప్పారు. కొన్ని చోట్ల ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరిగిందని, దీని వల్ల పేపర్ లీకైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.