రాష్ట్రీయం

విద్యతోనే సామాజిక భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 9: సమాజం భవితను నిర్ణయించేది విద్య మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ డీన్ లాయిడ్ బీ మైనర్‌తో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను స్టాన్‌ఫోర్డ్ కుటుంబ సభ్యుడినేనని, మొదటినుంచి తనకు స్టాన్‌ఫోర్డ్ అంటే ఆరాధనా భావం ఉండేదని తెలిపారు. అందుకే తన కుమారుడిని ఇక్కడికి పంపానని, ఆ తరువాత తన కోడలు కూడా ఇక్కడే విద్య అభ్యసించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపిలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. పరిపాలన నిర్వహణలో సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఏపిని వైజ్ఞానిక రాష్ట్రంగా మార్చాలన్నదే తన లక్ష్యంగా చెప్పారు. ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి సాధించాలనుకుంటున్నామని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తమకు విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని వనరులు, ఇతర అవకాశాలపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్‌తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించటానికి అవసరమైన అత్యున్నత పరిజ్ఞానం అక్కడ ఉందా అని ముఖ్యమంత్రిని జెన్నిఫర్ అడిగారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటి నిపుణుల్లో ఒకరు భారతీయులని ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉంటారని వివరించారు. విశాఖలో నిర్భయంగా తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించవచ్చునని సిఎం భరోసా ఇచ్చారు. అత్యున్నత పరిజ్ఞానం, తెలివితేటలు విషయంలో తమ రాష్ట్రం ఎప్పుడూ ముందే ఉంటుందని సందేహించవద్దని ఎపిని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తున్నామని తెలిపారు.

చిత్రం.. ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు అందుకుంటున్న చంద్రబాబునాయుడు