రాష్ట్రీయం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంస్కరణలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల విధానంలో సంస్కరణలు ఎంతో అవసరమని, ప్రధానంగా దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అవసరమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలపై కూడా నియంత్రణ అవసరమని అన్నారు. ఈ నెల 12న భారత ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పక్షాలతో నిర్వహించబోతున్న కీలక సమావేశంలో తమ పార్టీ ప్రధానంగా పై ప్రతిపాదనలను ప్రతిపాదించబోతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే సెక్యులర్ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ నెల 15 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్వహించబోతున్నామన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవిఎం) పట్ల సర్వత్రా అనుమానాలు చెలరేగుతున్న నేపథ్యంలో తమ పార్టీ మొదటి నుంచి కూడా పారదర్శకత్వం కోసం ఓటరు తన ఓటు ఎవరికి వేసిందీ నిర్ధారించుకోటానికి రశీదు వచ్చేలా చూడాలని కోరుతున్నామన్నారు. నిధుల కొరత ఉంటే పాత పద్ధతిలోనే బాలెట్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఏడాదికోసారి విరాళాలు వసూలు చేస్తుంటే దానిపై రకరకాల ఆంక్షలు విధిస్తున్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల నుంచి నల్లధనాన్ని విరాళాలుగా పొందుతూ ఏ ఒక్కరికీ జవాబుదారీ తనం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళ కాలంలో నేటివరకు 50 శాతం ప్రజామోద పద్ధతిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాలేదన్నారు. ఉదాహరణకు గత ఎన్నికల్లో ఎన్‌డిఎ కేవలం 31 శాతం ఓట్లతో అధికారంలోకి రాగా 61 శాతం మంది వ్యతిరేకించారని గుర్తు చేశారు. అందుకే దామాషా ప్రాతినిధ్యం తరపున పార్లమెంట్‌కు అభ్యర్థుల ఎన్నిక జరగాలన్నారు. అటు ప్రధాని మోదీ ఇటు చంద్రబాబు విదేశీ పెట్టుబడులకోసం తిరగని దేశం లేదని, అయితే వీరిరువురూ ఆశించిన మేర పెట్టుబడులు వచ్చేదిలేదన్నారు. ఒక వేళ వచ్చినా అభివృద్ధి సాధ్యపడదన్నారు. ప్రజా భాగస్వామ్యంతో పరిశ్రమల స్థాపన జరిగినప్పుడు ఉపాధితోపాటు కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయన్నారు. 2019 ఎన్నికల్లో విపక్షాలు కలిసి ఎన్‌డిఎకు దీటైన పోటీ ఇవ్వడానికి త్వరలో జరగబోయే రాష్టప్రతి ఎన్నిక రిహార్సల్స్ వంటివని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మతతత్వవాది రాష్టప్రతి అయితే రాజ్యాంగం కల్పించిన భద్రతకు ముప్పువాటిల్లగలదన్నారు. అందుకే ఉమ్మడి అభ్యర్థికోసం సెక్యులర్ పార్టీలన్నింటితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్‌డిఎ ప్రతి ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను భ్రమల్లో ముంచి ఓట్లు దండుకున్నా, కార్యాచరణలో అదేమీ కన్పించడం లేదన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, రైతుకు కనీసం మద్దతు ధర లభించడం దుర్లభంగా మారిందన్నారు. ఏటా 15వేల మందిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కరవు ప్రాంతాల్లో సహాయక చర్యలులేవని అన్నారు. అందుకే దేశవ్యాప్త ఉద్యమానికి నడుం కట్టామన్నారు.