బిజినెస్

ఏమిటి ఏలూరు ఆసుపత్రి ప్రత్యేకత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 11: పశ్చిమ గోదావరి జిల్లా కేం ద్రం ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అధికార్ల బృందం గురువా రం సందర్శించింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యసేవల అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రథ మ స్థానంలో ఉన్న ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ కార్యదర్శి హెలాలీజుయోనా, ఎన్‌హెచ్‌ఎం యుపి మిషన్ డైరెక్టర్ అలోక్ కుమార్ తదితర ఆరుగురు సభ్యుల అధికార్ల బృందం ప్రభుత్వాసుపత్రిని సందర్శించింది. ప్రభుత్వాసుపత్రిలో అమలవుతున్న వివిధ సాంకేతిక వైద్య విధానాల పనితీరును స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఆసుపత్రి డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు ఆసుపత్రిలో అమలవుతున్న వివిధ వైద్య సేవల తీరును వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలోని ప్రసూతి వైద్య కేంద్రాన్ని, డయాలసిస్ సెంటర్, టెలీ రేడియాలజీ సెంటర్, బ్లడ్ బ్యాం కునూ బృందం సందర్శించింది. పారిశుద్ధ్యం, ఆసుపత్రి పని విధానాన్ని కూలంకషంగా బృందం సభ్యులు పరిశీలించారు. 108, 104 అత్యవసర సేవ ల వాహనాలను పరిశీలించి, వాటిలో ఏర్పాటుచేసిన ఆధునిక సౌకర్యాలను వివరంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధా న పరిషత్తు కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్, జాయింట్ కమిషనర్ డాక్టర్ విజయచంద్రారెడ్డి, ఎపి డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ వైద్యులు డాక్టర్ అరుణకుమారి, ఎపి ఎన్‌హెచ్‌ఎం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వాసుదేవరావు, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, ఆసుపత్రిలో విధి నిర్వహణలోవున్న వైద్యులు, నర్సులు, ఎఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.