రాష్ట్రీయం

ఐటీ రోడ్డెక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11:హైదరాబాద్ మాదాపూర్ ఐటి కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన నాలుగు వేలమంది ఐటి నిపుణులు, ఉద్యోగులు తొలిసారిగా కార్మిక సంక్షేమ భవన్ గుమ్మమెక్కారు. కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు వేటు వేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు తెలంగాణ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)ని ఆశ్రయించారు. గురువారం ఇక్కడ టీటా ప్రతినిధులు, కార్మిక శాఖ సంక్షేమ భవన్‌లోజాయింట్ కమిషనర్ చంద్రశేఖరన్, కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కాగ్నిజెంట్ సంస్ధ ప్రతినిధులు తమకు 26వ తేదీ వరకు గడువు కావాలని, యాజమాన్యాన్ని సంప్రదించి తెలియచేస్తామని కార్మిక శాఖాధికారులకు తెలిపారు. ఈ చర్చల్లో టీటా అనేక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఆరు నెలల వేతనం చెల్లించాలని, కార్మిక శాఖ చట్టాలకు లోబడి వ్యవహరించాలని టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల కార్మిక శాఖ, కాగ్నిజెంట్ ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. ఉద్యోగం పోయిన వెంటనే బీమా సదుపాయం ఆగిపోతోందన్నారు. దీనివల్ల ఐటి ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు తీవ్రమైన ఇక్కట్లకు లోనవుతారన్నారు. ఏడాదిపాటు బీమా సదుపాయం కొనసాగించాలన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి ఏడాదిపాటు అదే కంపెనీలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు శిక్షణ ఇచ్చే సదుపాయం కల్పించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో ఉద్యోగులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వెబ్‌సైట్లు హాకింగ్‌కు గురవుతున్నాయని, సైబర్ నిపుణులుగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని నియమించాలన్నారు. వివిధ శాఖల్లో ఐటి సంబంధిత సేవల్లో ఐటి వర్కర్లను నియమించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని టీటా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
మాదాపూర్‌లో అలజడి
మాదాపూర్‌లోగత 30 రోజుల్లో దాదాపు నాలుగు వేలమంది ఐటి ఉద్యోగులను ఉద్యోగాల నుంచి వివిధ కంపెనీలు తొలగించడంతో ఐటి రంగంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కొత్తగా చేరిన వారు ఉద్యోగాలు పోతాయనే భయం పెట్టుకోవాల్సిన పనిలేదని, సీనియర్లపై మాత్రమే ప్రభావం ఉందని టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ ఆంధ్రభూమికి తెలిపారు. ఐటి కంపెనీల్లో గరిష్టంగా పదేళ్లు పనిచేయాలని ఆ తర్వాత పెద్ద జీతాల వారిని లక్ష్యంగా చేసుకుని ఐటి కంపెనీలు మిడిల్ లెవల్ ఐటి నిపుణులను ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. వారి రికార్డుల్లో ఫోర్త్ రేటింగ్ ఇచ్చే పద్ధతిని తొలగించాలని, దీనివల్ల మిగతా కంపెనీల్లో ఉద్యోగాలు రాని పరిస్ధితి నెలకొంది. ఈ డిమాండ్‌ను ఐటి కంపెనీల ముందు టీటా ప్రతినిధులు పెట్టారు. ఉద్యోగులను తొలగించేందుకు రేటింగ్‌లను తగ్గించడం మంచి పద్ధతి కాదని ఐటి ఉద్యోగులు కార్మిక శాఖను కోరారు. తమ డిమాండ్ల అమలుకు ఐటి కంపెనీలపై వత్తిడి తేవాలని ఐటి ఉద్యోగులు కోరారు.