రాష్ట్రీయం

రైతులకు సంకెళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 11: సరిగ్గా 14రోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనలో అరెస్టయిన 10మంది రైతులను గురువారం న్యాయస్థానానికి సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. రైతులపై మూడు కేసులు నమోదు చేయగా రెండు కేసుల్లో వాయిదాకు రైతులను తీసుకువస్తున్నారని తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు కోర్టువద్దకు భారీగా చేరుకున్నారు. పోలీస్ వాహనం నుండి రైతులు దిగుతున్న సమయంలో బేడీలు వేసి ఉండటాన్ని చూసి వారి కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై పెట్టిన కేసులే దేశద్రోహులపై పెట్టే కేసులని, ఇప్పుడు సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావడం పట్ల మరీ దారుణమని మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు వెంటనే తిరిగి జైలుకు తరలించారు. కాగా తమ పంటను అమ్ముకునేందుకు వచ్చి గిట్టుబాటుధర కావాలని అడిగిన రైతులను అరెస్టు చేయడమే కాకుండా సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావటాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంఘ విద్రోహ శక్తులకే బేడీలు వేయాలని న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై మానవహక్కుల సంఘానికి వెళ్తామని, ఉన్నత న్యాయస్థానంలో కూడా కేసు వేస్తామని ప్రకటించారు.
విచారణకు కమిషనర్ ఆదేశం
ఇదిలా ఉండగా రైతులకు బేడీలు వేయవచ్చా, వేయకూడదా అనేది లేదని, అయినప్పటికీ జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఖమ్మం అదనపు కమిషనర్‌ను పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని వెల్లడించారు.
సమాచారం తెలుసుకున్న టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు కోర్టు వద్దకు చేరుకొని మాట్లాడుతూ రైతులను అరెస్టు చేయడమే అక్రమమని, ఇప్పుడు నేరస్థులుగా, సంఘ విద్రోహ శక్తులు మాదిరిగా బేడీలు వేయడం దారుణమన్నారు. పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకే బేడీలు వేస్తే దేశంలోని సగంమందికి వేయాల్సి ఉంటుందన్నారు. రైతులు ఆగ్రహం చెందితే నిలబడిన ప్రభుత్వాలు లేవని, రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇద్దరు ఆర్‌ఎస్‌ఐల సస్పెన్షన్
రైతులకు బేడీల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. రైతులకు బేడీలు వేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ను నివేదిక కోరిన ప్రభుత్వం ఆయన నివేదిక ఇచ్చిన వెంటనే సంఘటనకు బాధ్యులుగా ఏఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, పూర్ణానాయక్‌లను సస్పెండ్ చేసింది. ఆ మేరకు నార్త్‌జోన్ ఐజిపి వై నాగిరెడ్డి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.

చిత్రం..ఖమ్మంలో గురువారం రైతులకు బేడీలు వేసి న్యాయస్థానానికి తీసుకువెళ్తున్న పోలీసులు