రాష్ట్రీయం

ఏపీ నుంచి తెలంగాణకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 54 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆ రాష్ట్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వారికి అసెంబ్లీ ఆవరణలో సహచర ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. చాలాకాలంగా రాష్ట్ర అసెంబ్లీలో పనిచేస్తున్న తమను తెలంగాణకు పంపాల్సిందిగా ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కోరడం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ సెక్రటరీకి ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేసింది. మిగిలిన 28 మందిని కూడా త్వరలో తెలంగాణకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యాలయ అధికారులు తెలిపారు.

చిత్రం..తెలంగాణకు బదిలీ అయిన అసెంబ్లీ ఉద్యోగులు