రాష్ట్రీయం

హడలెత్తిస్తున్న జీవో 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 11: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి వచ్చే జూనియర్, డిగ్రీ, పిజి తదితర కళాశాలలకు ఇక సొంత భవనాలు తప్పనిసరి. సొంత భవనాల్లేకపోతే 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాలను రద్దుచేస్తామని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో కలకలం రేగుతోంది. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలకు జీవో 29 ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 1308 కళాశాలలున్నాయి. ఇందులో 800 వరకు అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నాయి. దాదాపు 500 కళాశాలలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యా సొసైటీలకు ఐదేళ్లలోపు సొంత భవనాలు సమకూర్చుకోవాలనే నిబంధనతో అనుమతి లభించేది. దీనిని మరో ఐదేళ్లపాటు రెన్యువల్ చేసే విధానంవుంది. ఆపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆ కాలేజీకి గుర్తింపు రద్దయ్యే విధానం అమల్లోవుంది. ఈ విధానంలో సొసైటీలు కాలేజీ పెట్టిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడో ఒకచోట 2 ఎకరాల స్థలాన్ని చూపించాల్సివుంది. సొంత భవనాల మాటెలా ఉన్నప్పటికీ ఇతరత్రా సదుపాయాలు కూడా లేకుండా కోళ్ల ఫారాల మాదిరిగా కళాశాలలను నిర్వహిస్తున్న పరిస్థితి వుంది. ఎటువంటి పార్కింగ్, ఫైర్ రక్షణ, భద్రత చర్యలు గానీ మచ్చుకు కూడా కనిపించని ఆకాశ హర్మ్యాల మధ్య కళాశాలలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కనీస స్థాయిలో ఆటస్థలం గానీ, వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం కూడా లేనివిధంగా సొసైటీల పేరుతో కాలేజీలను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పలుకుబడి కలిగిన ప్రముఖ విద్యా సంస్థల కాలేజీలన్నీ ఆకాశ హార్మ్యాల భవనాల్లోనే నెట్టుకొస్తున్నాయి. దాదాపు అత్యధిక కాలేజీలు ఈ సంస్థలకే చెందినవే ఉండటంవల్ల నిబంధనలు అమలుచేయాల్సి వస్తే అందరికీ వర్తిస్తుందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. ఇందుకు సంబంధించి యాజమాన్యాలతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్ విజయవాడలో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సొంత భవనాల విషయంలో ప్రధానంగా స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు చర్చించనున్నట్టు తెలిసింది. 13 వర్శిటీల నుంచి 26 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సభ్యులు చర్చలు జరపనున్నట్టు సమాచారం.
ఇదిలావుండగా ఈ ఏడాది నుంచి ప్రైవేటు కాలేజీల్లో గుర్తింపు (అప్లియేషన్) ఫీజును మూడు రెట్లు పెంచారని ఆందోళన వ్యక్తమవుతోంది. పెంచిన ఫీజు భారం విద్యార్థులపైనే పడుతుంది తప్ప కళాశాలలు భరించవని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అప్లియేషన్ ఫీజు ఇప్పటి వరకు రూ.6000 ఉంటే అది కాస్తా రూ.18 వేలకు పెరిగింది. దీనితోపాటు ఇప్పటికే విద్యార్థులపై సెమిస్టర్ విధానంలో ఫీజు భారాన్ని మోపారు. ఇపుడు తాజాగా అప్లియేషన్ భారం పెరిగింది. నాలుగు, లేక ఐదు సెక్షన్లు పెరిగితే ఒక్కో సెక్షన్‌కు రూ.18 వేల చొప్పున అప్లియేషన్ ఫీజు యాజమాన్యాలు చెల్లించాల్సి వుంది. విద్యార్థుల ఉపకార వేతనాల్లోగాని, ఫీజు రియిబర్స్‌మెంట్‌లో గానీ ఎటువంటి పెంపుదలచేయని ప్రభుత్వం అప్లియేషన్ ఫీజు మాత్రం పెంచిందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కాలేజీల్లో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. కేవలం ఫీజు రియింబర్స్‌మెంట్ నుంచి మెల్లగా ప్రభుత్వం తప్పించుకునేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.