రాష్ట్రీయం

పీజీ డెంటల్‌కు పాత ఫీజులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద పీజీ మెడికల్ కోర్సుల ఫీజుల పెంపువ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పీజీ మెడికల్ డిప్లొమో కోర్సుల ఫీజులను ఇటీవల భారీగా పెంచడం తెలిసిందే. వచ్చే రెండేళ్లకు సంబంధించి ఫీజుకు బ్యాంక్ గ్యారంటీ, కన్వీనర్ కోటా విద్యార్థులకు స్టైపెండ్ వంటి అంశాల్లో మంత్రి తీరుపై వైద్య విద్యార్థులు, ఎపి ప్రభుత్వ వైద్యుల సంఘం విమర్శలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది పీజీ డెంటల్ విద్యార్థులు ఫీజులు భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 1.85 లక్షల రూపాయలుగా ఉన్న ఫీజును 5.5 లక్షల రూపాయలకు పెంచుతూ జీవో జారీ చేయడాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు, 23 మంది విద్యార్థుల నుంచి 1.85 లక్షల రూపాయలను మాత్రమే వసూలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 5.5 లక్షల రూపాయలకు బ్యాంక్ గ్యారంటీని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చూపించాల్సిందిగా విద్యార్థులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద విద్యార్థుల ప్రతిభ కన్నా ప్రైవేట్ వైద్య కళాశాలల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మంత్రి వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురి అవుతోంది.