రాష్ట్రీయం

నేడే ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11:తెలంగాణలో శుక్రవారం జరిగే ఎమ్సెట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు మెటల్ బటన్లు ఉన్న చొక్కాలు ధరించకూడదని, కళ్లద్దాలు, రిస్టువాచీలు పెట్టుకోకూడదని చెప్పారు. అలాగే అమ్మాయిలు ఆభరణాలు ధరించకుండా రావాలన్నారు. పెన్ను, ఆన్‌లైన్ అప్లికేషన్, హాల్‌టిక్కెట్లు మినహా పరీక్ష కేంద్రంలోకి వేటినీ అనుమతించే ప్రసక్తి లేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇంజనీరింగ్‌కు 246, అగ్రికల్చర్‌కు 154 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,20,248 దరఖాస్తులు రాగా అందులో ఇంజనీరింగ్‌కు 1,41,187 అగ్రికల్చర్‌కు 79,061దరఖాస్తులు వచ్చాయి. రాష్టవ్య్రాప్తంగా
24 ప్రాంతీయ కేంద్రాలు, ఆంధ్రాలో మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకూ అగ్రికల్చర్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. విజయవాడ కేంద్రానికి 8685 ఇంజనీరింగ్, 5320 అగ్రికల్చర్ కలిపి 14,085 దరఖాస్తులు వచ్చాయి. విశాఖపట్టణం కేంద్రానికి 3934 ఇంజనీరింగ్, 2371 అగ్రికల్చర్ కలిపి 6363, తిరుపతి కేంద్రానికి 5766 దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రాకు మొత్తం 26,214 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాలకు గానూ 54747 ఇంజనీరింగ్, 23047 అగ్రికల్చర్ స్ట్రీం దరఖాస్తులు కలిపి 77,755 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 18 రీజినల్ సెంటర్లలో 70865 ఇంజనీరింగ్ స్ట్రీం, 45,375 అగ్రికల్చర్ స్ట్రీం కలిపి 1,16,240 దరఖాస్తులు వచ్చాయి.