రాష్ట్రీయం

త్వరలో మరో 14 డయాలసిస్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని,మే 12: రాష్ట్రంలో త్వరలో మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొత్తం 19 డయాలసిస్ సెంటర్లకు గాను ఇప్పటికే ఉద్దానంలో మూడు, మరోప్రాంతంలో రెండు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 14 కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో తీసుకున్న విప్లవాత్మక మార్పుల వల్ల రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి 32 శాతం, కాన్పులు 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఆసుపత్రిలో శానిటేషన్ పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతి ఆసుపత్రిలో పరికరాల కొరత లేకుండా తగుచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. గ్రామీణ ప్రాం తాల్లో సైతం వైద్య సౌకర్యం ఎంతో మెరుగైందని అన్నా రు. డాక్టర్లు ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో బయోమెట్రిక్ పద్దతి ప్రవేశపెట్టామని చెప్పారు. శ్వాస విద్యావాహిని పథకం కింద మెడికల్ విద్యార్థులు గ్రామాలకు వెళ్ళి వైద్య సౌకర్యం అందించే ఏర్పాటు చేశామని అన్నారు. డాక్టర్లను కాంట్రాక్టు పద్దతిపై కాకుండా రెగ్యులర్ పద్దతిలో నియమించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
చంద్రన్న సంచార చికిత్స పథకం కింద మొబైల్ వాహనాల్లో గ్రామాల్లోనే వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం కింద ప్రతి ఆసుపత్రిలో శ్వాస కోశ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులకు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉంచి డాక్టర్లును నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఎండోస్కోపి ద్వారా రోగులను పరీక్షించి వారికి తగిన చికిత్స చేయడానికి డాక్టర్లును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.