ఆంధ్రప్రదేశ్‌

నేడు ఖమ్మంలో టిడిపి రైతు పోరుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 12: రైతు సమస్యలను పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో రైతు పోరుయాత్ర పేరుతో శనివారం ఖమ్మంలో భారీ ధర్నా చేపట్టనున్నారు. గత నెల 28వ తేదీన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించగా నాటి నుంచి టిడిపి ఇతర పార్టీలతో కలిసి ప్రతిరోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నది. ఈ క్రమంలో గత నెల 29వ తేదీనే ఖమ్మంలో ధర్నా చేపట్టాల్సి ఉండగా అప్పటికే ఖమ్మంలో 144వ సెక్షన్ ఉండటం, పోలీసుల నిర్బంధం ఉన్న దృష్ట్యా ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన టిడిపి శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి వెనుకకు తిరిగివెళ్ళారు. నాటినుంచి ఖమ్మంలో భారీ ధర్నా చేపడతామని చెబుతున్న టిడిపి నేతలు 12,13 తేదీల్లో ధర్నా జరుపుతామని, దీనికి రాష్ట్ర నేతలు హాజరవుతారని అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేస్తామని చెప్పిన టిడిపి నేతలు.. పోలీసులు 13వ తేదీన అనుమతినిస్తున్నట్టు తెలపడంతో ధర్నాను ఒక్కరోజుకు మార్చారు. ఈ ధర్నాలో పార్టీ శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర నేతలంతా పాల్గొంటున్నారని, రైతుపోరుయాత్ర దీక్షకు ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు హాజరవుతారని వెల్లడించారు.