రాష్ట్రీయం

డిజిటల్ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మూడేళ్లుగా రికార్డు సృష్టిస్తోన్న తెలంగాణ, డిజిటల్ (నగదు రహిత) లావాదేవీల్లోనూ దేశంలోనే ప్రథమ స్థానాన్ని పదిలపర్చుకుంది. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు చెల్లించే వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లోనూ డిజిటలైజేషన్‌తో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నగదురహిత లావాదేవీల్లో టాప్ 3 రాష్ట్రాల్లో తెలంగాణ, హర్యానా, గుజరాత్‌లు నిలిస్తే, ఈ మూడింటిలో తెలంగాణ ప్రథమస్థానం పొందినట్టు రాష్ట్ర లీడ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణకు ఇంతకాలంగా లీడ్ బ్యాంక్‌గా వ్యవహరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇటీవల ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా, రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ చైర్మన్ హర్‌దయాల్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించాక జరిగిన మొట్టమొదటి సమావేశంలో నగదురహిత లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు ప్రకటించారు. తొమ్మిది కోట్లమంది జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి నెలా రూ. 14 కోట్ల ఈ-ట్రాన్సాక్షన్స్ (నగదురహిత లావాదేవీలు) జరుగుతుంటే, కేవలం 3.46 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో రూ.20 కోట్ల లావాదేవీలు సాగిస్తూ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్టు హర్‌దయాల్ ప్రసాద్ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీల ప్రోత్సహానికి కేంద్రం తోడ్పాటు అందిస్తుంది. నగదురహిత లావాదేవీల ప్రోత్సహానికి ఆర్బీఐ అనేక రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. నగదురహిత లావాదేవీలపై నీతి అయోగ్ నెల నెలా రాష్ట్రాలవారీగా లెక్కలు తీస్తుంది. తెలంగాణలో ప్రతి 2084 ఆర్థిక లావాదేవీల్లో వెయ్యిమంది నగదు రహిత లావాదేవీలు నిర్వహించినట్టు నీతి అయోగ్ గుర్తించింది.
వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లతోపాటు 127 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించిన బిల్లులు (విద్యుత్, నీరు, ఆస్తి, వాణిజ్య పన్నులు) చెల్లింపుల్లో నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో 400 గ్రామాలు నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు లీడ్ బ్యాంక్ ప్రకటించింది. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యేనని పేర్కొంది. ఇలావుండగా ఆధార్ కార్డులు, మొబైల్ నెంబర్ల సీడింగ్‌లోనూ తెలంగాణ ముందంజలో ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో ఆధార్ సీడింగ్ 69 శాతం, మొబైల్ నెంబర్ల సీడింగ్ 81 శాతం జరిగినట్టు ఆర్థికశాఖ కార్యదర్శి, రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ సభ్యుడు సందీప్ సుల్తానీయా వెల్లడించారు.