రాష్ట్రీయం

ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సిబిఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 12:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి ఇళ్లపై సిబిఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నెల్లూరులోని ఆయన అతిథిగృహంతోపాటు బెంగళూరు, హైదరాబాద్‌లలో వాకాటికి చెందిన ఇళ్లపై అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. వేదాయపాలెం వద్ద ఉన్న వాకాటి అతిథిగృహంలోనూ, విఎన్‌ఆర్ ఇన్‌ఫ్రా కార్యాలయంలోనూ సిబిఐ అధికారులు శుక్రవారం పొద్దుపోయే వరకు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో వారు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తొలుత దాడులు నిర్వహిస్తున్నది ఆదాయపన్ను అధికారులని భావించినా, సోదాలు చేస్తున్నది సిబిఐ అని తరువాత తెలిసింది. వాకాటి గతంలో పలు బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు వాకాటి 205 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై వివిధ బ్యాంకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగానే సిబిఐ రంగంలోకి దిగినట్టు సమాచారం. వాకాటికి చెందిన విఎన్ ఇన్‌ఫ్రా కంపెనీతోపాటు మరో ఆరు కంపెనీలు కొన్ని ఆస్తులను తనఖా ఉంచుతూ రూ.190కోట్ల వరకు రుణాలు తీసుకున్నాయని, అయితే ఆస్తుల విలువ ఎక్కువ చేసి చూపి మోసం చేసినట్లు ఐఎఫ్‌సిఎల్ చేసిన ఫిర్యాదు మేరకు వాకాటి సహా మరికొందరిపై గతంలో కేసు నమోదైంది. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు గతంలో కొన్ని బ్యాంకులు పత్రికల ద్వారా ప్రకటనలు జారీ చేశాయి కూడా. ఇటీవల ఆదాయపన్ను అధికారులు సైతం వాకాటి ఇళ్లపై దాడులు నిర్వహించారు. నెల్లూరులోని అతిథిగృహంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో వాకాటి కూడా అక్కడే ఉన్నారు. సోదాలకు సంబంధించి అధికారులు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.
విచారణ కోసం వచ్చారు : వాకాటి
సిబిఐ దాడులపై వాకాటి స్పందిస్తూ వ్యాపార, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఆరోపణలపై విచారించేందుకు అధికారులు వచ్చారని వాకాటి చెప్పారు. అధికారులు అడిగిన వాటికి వివరంగా సమాధానం చెప్పానన్నారు. అయితే హైదరాబాద్, బెంగళూరులోని తన ఇళ్లలో సోదాలు జరిగాయనడం వాస్తవం కాదన్నారు.