రాష్ట్రీయం

నగరమే ధర్నా చౌక్ అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను మూసి వేస్తే, నగరమంతా ధర్నా చౌక్‌గా మారుతుందని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ హెచ్చరించారు. ధర్నా చౌక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మూసి వేసి, నిరసనలు, ధర్నాలకు నగర శివారులోని ఏదైనా ప్రాంతాన్ని కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టి.జెఎసి అధ్వర్యంలో నిర్వహించిన వౌన దీక్షలో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, వామపక్షాల నేతలు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహారిస్తున్నదని దుయ్యబట్టారు. ఇందిరా పార్కు వద్ద చాలా సంవత్సరాలుగా ధర్నా చౌక్ కొనసాగుతున్నదని చెప్పారు. దీని వల్ల ఎవరికీ ఆటంకం లేదని, ట్రాఫిక్ సమస్య లేదని, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు అసౌకర్యంగా ఏమీ లేదని ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహారిస్తూ, ప్రజలకు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నదని విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను పునరుద్ధరించకపోతే నగరమంతా ధర్నా చౌక్‌గా మారుతుందని ఆయన హెచ్చరించారు. ధర్నా చౌక్‌ను పరిరక్షించుకోవడానికి జిల్లాల నుంచి ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు, ప్రజలు, రైతులు తరలి రావాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ఖమ్మం మిర్చి యార్డులో ఆందోళన చేసిన రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఒక్క ఖమ్మం రైతులకు మాత్రమే వేసినట్లు కాదని, మొత్తం రైతులకు బేడీలు వేసినట్లేనని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకసపోతే 15న ‘్ఛలో ధర్నా చౌక్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
రైతులకు క్షమాపణ చెప్పాలి
టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. ఖమ్మం మిర్చి యార్డులో రైతులకు పోలీసులు బేడీలు వేసినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రసంగిస్తూ 20 ఏళ్ళుగా ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం సరైంది కాదని అన్నారు. రైతులకు బేడీలు వేయడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకోవడం అవివేకమని ఆయన తెలిపారు. సిపిఐ నాయకుడు, మాజీ ఎంపి అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధర్నా చౌక్‌ను పునరుద్ధరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.