బిజినెస్

జాబ్ మేళాలో 166 మందికి ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ట్రేడ్ హైదరాబాద్.కామ్, టెరాబైట్ ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 166 మందికి ఉద్యోగాలు లభించాయి. కొత్తపేటలోని టెరాబైట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉద్యోగ మేళాను రాచకొండ డిసిపి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరహా ఉద్యోగ మేళా నిర్వహించడం నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కొన్ని సంస్థలు నిరుద్యోగులను మోసం చేసి డబ్బు గుంజుతాయని, ఈ సంస్థ స్వచ్ఛందంగా నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ఇలా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ట్రేడ్ హైదరాబాద్.కామ్ సిఈఓ వెంకట్ బులేమోని మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 20 కంపెనీలు పాల్గొనగా, సుమారు 1000 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారని తెలిపారు. టెరాబైట్ సంస్థ ఎండి నితిషా మాధవరం మాట్లాడుతూ తమ సంస్థలో విద్యార్థులకు శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగం ఇప్పించాలన్నదే ధ్యేయమని అన్నారు. పదేళ్ల పాటు అమెరికాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేసి స్వదేశానికి ఏదైనా చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్‌లో టెరాబైట్‌ను ప్రారంభించామని అన్నారు.