రాష్ట్రీయం

21న తెలంగాణ ఎమ్సెట్ ర్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ఎమ్సెట్ తొలి కీని శనివారం రాత్రి ఎమ్సెట్ కమిటీ విడుదల చేసింది. తొలికీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో కమిటీ దృష్టికి తీసుకురావాలని కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య పేర్కొన్నారు. పోస్టులో, వ్యక్తిగతంగా వచ్చి ఇచ్చిన అభ్యంతరాలను స్వీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ఎమ్సెట్ తొలి కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది కీ రూపొందించి ఫలితాలను ఈ నెల 21న వెల్లడించనున్నారు. కాగా వివిధ విద్యాసంస్థల విద్యార్థులు ఎమ్సెట్‌లో పొరపాట్లు చాలా వచ్చాయని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగంలో ఈ పొరపాట్లు ఎక్కువగా ఉన్నట్టు వారు చెప్పారు. ఎమ్సెట్‌లో ఈసారి ఇంజనీరింగ్ స్ట్రీంలో ఐదు పొరపాట్లు జరిగినట్టు వారు వాపోతున్నారు. అగ్రికల్చర్ స్ట్రీంలోనూ నాలుగు తప్పులు దొర్లాయని అంటున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీం కోడ్ -ఎ పేపర్‌లో మాథ్స్‌లో 72వ ప్రశ్న, ఫిజిక్స్‌లో 83,97,98వ ప్రశ్నలకు సమాధానాలు సరిగా లేవని, ఫిజిక్స్‌లో 112వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. ఇంజనీరింగ్ స్ట్రీంకు ఐదు మార్కులు, మెడికల్ స్ట్రీంకు నాలుగు మార్కులు కలపాలని, లేదా ఆ మేరకు ప్రశ్నలను తొలగించి మిగిలిన మార్కుల మేరకు ర్యాంకులు ఇవ్వాలని వారు కోరారు.